Tatiparthi Jeevan Reddy: సీనియర్లను గౌరవించరా? కాంగ్రెస్‌లో నా స్థానమేంటి
ABN , Publish Date - Apr 16 , 2025 | 03:54 AM
కాంగ్రెస్ పార్టీలో తన స్థానం పై సీనియర్ నేత తాటిపర్తి జీవన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్లకు గౌరవం ఇవ్వకుండా, పార్టీ నాయకత్వం నిర్లక్ష్యం చూపుతున్నారంటూ ఆరోపించారు. తన గురించి మాట్లాడుతూ, "నేను రాజ్యసభ మాజీ సభ్యుడు వీహెచ్ తర్వాత సీనియర్ని" అని చెప్పిన ఆయన, 4 దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నారని తెలిపారు.

మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి
జగిత్యాల, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై సీనియర్ నేత తాటిపర్తి జీవన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్లను గౌరవించరా? అని ప్రశ్నించారు. ‘పార్టీలో నా స్థానం ఏమిటి? సీనియారిటీకి గౌరవం పొందలేని పరిస్థితులున్నాయి. ఇది నాకు అసంతృప్తిగా ఉంది’ అని ఆయన మంగళవారం జగిత్యాలలో మీడియా తో అన్నారు. ‘రాష్ట్రంలో కాంగ్రె్‌సలో రాజ్యసభ మాజీ సభ్యుడు వీ హన్మంత్‌రావు (వీహెచ్) తర్వాత నేనే సీనియర్ని.. జానారెడ్డి కూడా నా తర్వాత నాలుగేళ్లకు సభ్యత్వం తీసుకున్నారు’ అని చెప్పారు. గతంలో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి, శాసనసభాపక్ష నేతగా భట్టి విక్రమార్క స్థాయిలోనే తానూ శాసనమండలిలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఒంటరిపోరాటం చేశానన్నారు. 4 దశాబ్దాలుగా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నానని చెప్పారు. సీనియర్ నేతలు ప్రేమ్‌సాగర్‌రావు, రాజ్‌గోపాల్‌రెడ్డి పదవులు ఆశించడం తప్పుగా భావించొద్దన్నారు.
For AndhraPradesh News And Telugu News