TPCC Chief: టీపీసీసీ చీఫ్‌ బ్లాక్‌ బెల్ట్‌

ABN, Publish Date - Apr 01 , 2025 | 05:30 AM

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు కరాటేలో బ్లాక్ బెల్ట్ డాన్ 7 సర్టిఫికెట్‌ను ప్రదానం చేశారు. కరాటే తన జీవితంలో ఒక భాగంగా మారింది అని, భవిష్యత్తులో 2027లో హైదరాబాద్‌లో ఆసియా కరాటే పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు.

TPCC Chief: టీపీసీసీ చీఫ్‌ బ్లాక్‌ బెల్ట్‌

ప్రదానం చేసిన ఒకినవా మార్షల్‌ ఆర్ట్స్‌ అకాడమీ

హైదరాబాద్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌గౌడ్‌కు సోమవారం ఒకినవా మార్షల్‌ ఆర్ట్స్‌ అకాడమీ.. కరాటేలో బ్లాక్‌ బెల్ట్‌ డాన్‌ 7 సర్టిఫికెట్‌ను ప్రదానం చేసింది. వెస్ట్‌ మారేడ్‌పల్లిలోని వైడబ్ల్యూసీఏలో 3 గంటల పాటు జరిగిన కరాటే పరీక్షలో పాల్గొన్న మహేష్‌ కుమార్‌గౌడ్‌.. అందులో ఉత్తీర్ణుడయ్యారు. దీంతో మార్షల్‌ ఆర్ట్స్‌ అకాడమీ ఆయనకు బ్లాక్‌ బెల్ట్‌ డాన్‌ 7 సర్టిఫికెట్‌ను ప్రదానం చేసింది. విద్యార్థి దశ నుంచీ కరాటేలో ప్రావీణ్యం ఉన్న మహే్‌షగౌడ్‌.. టీపీసీసీ చీఫ్‌ అయిన తర్వాత కూడా ప్రాక్టీస్‌ చేస్తూనే ఉన్నారు. బ్లాక్‌ బెల్ట్‌ డాన్‌ 7 సర్టిఫికెట్‌ పొందిన అనంతరం మహే్‌షకుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ.. కరాటే అన్నది తన జీవితంలో ఒక భాగంగా మారిందన్నారు. ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులు.. పిల్లలను కంప్యూటర్‌ కిడ్స్‌ల తయారు చేస్తూ మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చదువుతో పాటుగా క్రీడల పట్లా ఆసక్తి కలిగించాలని, శారీరక ఆరోగ్యానికి క్రీడలు, వ్యాయామం ఎంతో అవసరమన్నారు. తాను ఎంత బిజీగా ఉన్నా కరాటేకు తప్పకుండా సమయం కేటాయిస్తానన్నారు. కరాటే అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ ఉపాధ్యక్షుడిగా కరాటే పోటీల నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. కరాటే బ్లాక్‌బెల్ట్‌ డాన్‌ 7 సర్టిఫికెట్‌ను తీసుకోవడం తనకు గర్వంగా, సంతోషంగా ఉందన్నారు. కరాటే పోటీల్లో భాగంగా తాను పలు దేశాల్లో పర్యటించానన్నారు. ఆసియా కరాటే పోటీలను 2027లో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.


ఈ వార్తలు కూాడా చదవండి

Bandi Sanjay Comments On HCU: ఆ వీడియోలు చూస్తే బాధేస్తోంది

HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై దర్యాప్తు వేగవంతం..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 01 , 2025 | 05:30 AM