12 నుంచి గిరిజన, ఆదివాసీలకు శిక్షణ తరగతులు
ABN, Publish Date - Feb 09 , 2025 | 11:33 PM
దేశ వ్యాప్తంగా గిరిజనులు, ఆదివాసీల చైత న్యం కోసం రాజకీయ శిక్షణా తరగతులు నిర్వ హించేందుకు శ్రీకారం చుట్టిందని ఆదివాసీ కాంగ్రెస్ కమిటీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు లింగంనాయక్ అన్నారు.

- ఆదివాసి కాంగ్రెస్ కమిటీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు లింగంనాయక్
నాగర్‌కర్నూల్‌టౌన్, ఫిబ్రవరి9 (ఆంధ్రజ్యోతి) : దేశ వ్యాప్తంగా గిరిజనులు, ఆదివాసీల చైత న్యం కోసం రాజకీయ శిక్షణా తరగతులు నిర్వ హించేందుకు శ్రీకారం చుట్టిందని ఆదివాసీ కాంగ్రెస్ కమిటీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు లింగంనాయక్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఏఐసీసీ జాతీయ నేత రాహుల్‌గాంధీ పిలుపు మేరకు దేశంలో గిరిజన, ఆదివాసీల అభివృద్ధికి గత నెలలో నాగార్జునసా గర్‌లో వారంలో రోజుల పాటు ట్రైనర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారని తెలిపారు. జిల్లాలో ని సోమశిల పర్యాటక క్షేత్రంలో ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గిరి జన, ఆదివాసీలకు శిక్షణా తరగతులు నిర్వహి స్తున్నట్లు తెలిపారు. ట్రైనర్లుగా ఏఐసీసీ ఆదివా సి కాంగ్రెస్ కమిటీ చైర్మన్ కొప్పుల రాజు బృం దం వ్యవహరించనున్నారని తెలిపారు. శిక్షణా త రగతుల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథు లుగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావుతో పాటు ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారని పేర్కొన్నారు. ముగిం పు కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మం త్రి దామోదర రాజనర్సింహ హాజరవుతారన్నా రు. సమావేశంలో ఆదివాసి కాంగ్రెస్ కమిటీ జి ల్లా అధ్యక్షుడు, కొల్లాపూర్ మాజీ హన్మంతు నా యక్, జిల్లా ఇన్‌చార్జీలు లక్ష్మణ్‌నాయక్, కూరా కుల శ్రీనివాస్, అచ్చంపేట ఇన్‌చార్జి శ్రీనివాస్‌రా థోడ్, కల్వకుర్తి ఇన్‌చార్జి కృష్ణనాయక్, నారా యణపేట ఇన్‌చార్జి నర్సింగ్‌నాయక్, కొడంగల్ ఇన్‌చార్జి అనిల్‌నాయక్ పాల్గొన్నారు.
Updated Date - Feb 09 , 2025 | 11:33 PM