క్షయ వ్యాధి నిర్మూలనకు సహకరించాలి
ABN, Publish Date - Mar 24 , 2025 | 11:18 PM
క్షయ నిర్మూలనలో అందరు సహకరించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ కేవీ.స్వరాజ్యలక్ష్మి పిలుపుని చ్చారు.

- డీఎంహెచ్‌వో డాక్టర్ కేవీ.స్వరాజ్యలక్ష్మి
కందనూలు, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : క్షయ నిర్మూలనలో అందరు సహకరించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ కేవీ.స్వరాజ్యలక్ష్మి పిలుపుని చ్చారు. సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినం సందర్భంగా డీఎంహెచ్‌వో అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనం తరం అందరిచే క్షయ నిర్మూలనయే ప్రతీ ఒక్క వైద్య సిబ్బంది జీవిత ఆశయమని ప్రతిజ్ఞ చేయించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ రెం డు వారాల నుంచి జ్వరం రావడం, బరువు, ఆకలి తగ్గిపోవడం, తదితర లక్షణాలు, సంపూర్ణ చికిత్స గురించి క్షేత్రస్థాయి వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కలిపించాలని కోరారు. ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ వంద రోజుల నిక్షయ్ శివిర్‌లో 250క్యాంపులు నిర్వహించి 1,37,325 అనుమానితులను పరీక్షిం చగా, కొత్తగా 511 క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తిం చి చికిత్స ప్రారంభించినట్లు తెలిపారు. ఈ వం ద రోజుల నిక్షయ్ శివిర్ కార్యక్రమంలో ఉత్త మ ఎస్‌టీఎల్‌ఎస్‌గా రాజ్‌కుమార్, నాగర్‌కర్నూ ల్ జిల్లా నుంచి రీజినల్ డైరెక్టర్ డాక్టర్ అనురా ధ, జాయింట్ డైరెక్టర్‌గా రాజేశం నుంచి అవా ర్డు అందుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం లో ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ రవికుమార్, వై ద్యాధికారులు డాక్టర్ సంతోష్ అభిరామ్, డాక్టర్ వాణి, డీపీవో రేణయ్య, ఎంఎల్ హెచ్‌పీలు పర్య వేక్షణ సిబ్బంది, ఎస్‌టీఎస్ శ్రీను, ఆరీఫ్‌ఖాన్, ముక్తార్, సత్యారెడ్డి, ఏఎన్‌ఎమ్‌లు పాల్గొన్నారు.
సికిల్ సెల్ అనీమియాపై అవగాహన
కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కేవీ.స్వరాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో సోమవారం సికిల్‌సెల్ అనీమి యాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ సికిల్‌సెల్ అనీమియా జ న్యుపరమైన లోపం వలన తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తుందని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 59, 154మంది గిరిజనులకు సికి ల్ సీఎల్ పీవోసీ (ప్రాథమిక పరీక్షలు) నిర్వ హించామని, వారికి ఐడెంటిటి కార్డులు కూడా ఇచ్చామని తెలిపారు. రాష్ట్ర శిక్షకులు, ఆంకోహి మటాలజిస్టు డాక్టర్ రాధిక సికిల్ సెల్ బాధి తుల, లక్షణాలు, ఇబ్బందులు, చికిత్స జన్యు తెరపి, ఎముక మజ్జ మార్పిడి గురించి వైద్యాధి కారులకు అవగాహన కల్గించారు. ఈ కార్యక్ర మంలో రాష్ట్ర ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ హీనా, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటదాస్, ప్రో గ్రామ్ అధికారి డాక్టర్ ప్రదీప్, డాక్టర్ కృష్ణమో హన్, ఎపిడేమి యాల జిస్టు ప్రవళిక, డీపీవో రేణయ్య, డీడీఎంలు సందీప్‌రావు, నవీన, వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, జిల్లా ఆసుపత్రి చిన్న పిల్లల వైద్యులు, ఫార్మా సిస్టులు పాల్గొన్నారు.
Updated Date - Mar 24 , 2025 | 11:18 PM