అట్టడుగువర్గాల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేయాలి
ABN , Publish Date - Apr 08 , 2025 | 11:17 PM
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఎస్సీ కమిషన్ జాతీయ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్ అన్నారు.

- ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సత్వరం పరిష్కరించాలి
సమీక్షా సమావేశంలో ఎస్సీ కమిషన్ జాతీయ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్
జ్యోతినగర్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి) : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఎస్సీ కమిషన్ జాతీయ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్ అన్నారు. మంగళవారం ఎన్టీపీసీ ఈడీసీ మిలీ నియంలో హాలులో పెద్దపల్లి, మంచిర్యాల కలెక్టర్లు కోయ శ్రీహర్ష, కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ జె.అరుణశ్రీ, డీసీపీ భాస్కర్, ఎస్సీ కమిషన్ జాతీయ సలహాదారులు సునీల్ బాబు, రీసెర్చ్ అధికారి డి.వరప్రసాద్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ఎస్సీ వర్గాలకు అమలవుతున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాల గురించి కలెక్టర్లు వివరించారు. గతంలో ఎస్సీ కమిషన్ సభ్యుడి ఆధ్వర్యంలో జరిగిన సమావే శాల్లో జారీ చేసిన ఆదేశాలు, సూచనల అమలు, పనుల పురో గతిని అధికారులు వివరించారు. ఎస్సీ కమిషన్ జాతీయ సభ్యు డు వడ్డెపల్లి రాంచందర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కేసులను పక్కాగా నమోదు చే యాలని, నిందితులకు కచ్చితంగా శిక్ష పడేలా సాక్ష్యాలను సేకరించాలన్నారు. అట్రాసిటీ కేసుల సత్వ ర పరిష్కారానికి పోలీసు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. అందిన ఫిర్యాదులకు తక్షణం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేయాలని ఆ దేశించారు. బెల్లంపల్లిలో ఉన్న ఇండస్ట్రియల్ పార్కులో ఎస్సీ ఔ త్సాహిక పారిశ్రామికవేత్తలకు భూములు కేటాయించాలని సూచించారు. దళితుల భూములను ఆక్రమించిన వారిపై చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలని, ఆక్రమణదారుపై కేసులు నమోదు చేయాలన్నారు. ప్రభుత్వ నియామకాలలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పకుండా పాటించాలన్నారు. రెండు జిల్లాల్లోని ఎస్సీ బ్యాక్‌లాగ్ పోస్టులు, కారుణ్య నియామకాలు, పదోన్నతుల పెండింగ్ లిస్టు అందజేయాలని ఆదేశించారు.