రైతుల పక్షాన పోరాడుతాం
ABN, Publish Date - Jan 09 , 2025 | 11:56 PM
రైతు లకు అన్ని విధాలా న్యాయం జరిగేదాకా వారి పక్షాన బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యం లో పోరాడుతామని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు.
- కొల్లాపూర్ నిరసనలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి
కొల్లాపూర్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి) : రైతు లకు అన్ని విధాలా న్యాయం జరిగేదాకా వారి పక్షాన బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యం లో పోరాడుతామని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు. గురువారం రై తులు సాగుచేసిన పంటలకు స కాలంలో నీళ్లు అందించాలని, వరికి క్వింటాల్‌కు రూ.500 బోన స్ ఇవ్వాలని, రైతుభరోసా రూ.15 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కొల్లాపూర్‌లో ఆర్డీవో భన్సీలా ల్‌కు వినతిపత్రం అందజేశారు. పట్టణంలో బీఆర్‌ఎస్ నాయకులు ఆర్డీవో కార్యాలయం వరకు బైక్ ర్యాలీగా వెళ్లారు. హర్షవర్ధరెడ్డి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రైతు భరోసా పేరుతో రూ.15వేలు ఇస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు రూ.12వేలు ఇస్తామనడం సరికాదని అన్నారు. ఆరు గ్యారెంటీలను నెరవేర్చే పరిస్థితి లేక బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. సింగోటం, గోపాల్‌దిన్నె లింకు కెనాల్ పనుల టెండరు దక్కించుకున్న రాఘవ కన్‌స్ట్రక్షన్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పనులను ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కాలం ఒకేలా ఉండదని, ప్రతీ దానికి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని బీరం హెచ్చరించారు.
Updated Date - Jan 09 , 2025 | 11:56 PM