వెయిట్ లిఫ్టింగ్ విజేత సూర్యాపేట జిల్లా
ABN, Publish Date - Jan 13 , 2025 | 12:49 AM
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని తేజ టాలెంట్ స్కూల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఆదివారం ముగిశాయి.
కోదాడటౌన్, జనవరి 12(ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని తేజ టాలెంట్ స్కూల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఆదివారం ముగిశాయి. రెండో రోజు 12జిల్లాల నుంచి 120 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 120టాప్ ఛాంపియన్ షిప్ యూత్ జూనియర్, సీనియర్ విభాగం మెన్‌లో మేడ్చల్, మల్కాజ్‌గిరి జిల్లా క్రీడాకారులు విజేతలుగా నిలిచారు. మహిళల విభాగంలో సూర్యాపేట జిల్లా విజేతగా నిలిచింది. వీరితో పాటు ఉత్తమ వెయిట్ లిప్టర్ యూత్ ఉమెన్ విభాగంలో ఖమ్మం జిల్లాకు చెందిన ఏతోని శ్రీ, జూనియర్ సీనియర్ విభాగంలో సీహెచ్ అనూష్ మేడ్చల్, మల్కాజ్‌గిరి, పురుషుల బెస్ట్ వెయిట్ లిప్టింగ్ యూత్‌లో ఖమ్మంకు చెందిన కే. అభిరామ్, జూనియర్ సీనియర్‌లో కె. మోహన్ బెస్ట్ వెయిట్ లిఫ్టర్లుగా నిలిచారు. విజేతలకు కోదాడ రూరల్ సీఐ రజితారెడ్డి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత విద్యతో పాటు క్రీడల్లో ప్రావీణ్యం ఉంటే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్నారు. తెలంగాణ రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పాలడుగు ఖ్యాతి మాట్లాడుతూ రెండురోజుల పాటు కోదాడలో పోటీలు నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేకల వెంకట్రావు, ఎస్‌ఆర్‌కే మూర్తి, దేవబత్తిని నాగార్జున, కోటిరెడ్డి, వేనేపల్లి శ్రీనివాసరావు, ఆకుల శ్రీనివాస్, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పుల్లారావు, జానకి రామయ్య, హనుమంతరాజు, శివకృష్ణమూర్తి, శ్రీనివాస్, గణేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 13 , 2025 | 12:50 AM