రైతుల సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యం
ABN, Publish Date - Jan 12 , 2025 | 01:36 AM
వ్యవసాయ అభివృద్ది, రైతాంగ సంక్షేమం ప్రభుత్వం లక్ష్యమని ఉమ్మడి కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవ న్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో శనివారం ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలి సి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ దేశంలో రుణమాఫీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు.
జగిత్యాల అగ్రికల్చర్, జనవరి 11(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ అభివృద్ది, రైతాంగ సంక్షేమం ప్రభుత్వం లక్ష్యమని ఉమ్మడి కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవ న్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో శనివారం ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలి సి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ దేశంలో రుణమాఫీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాపై కార్యాచరణ సిద్ధం చేసి, అమలుకు శ్రీకారం చుడితే ప్రజలను అపోహలు, ఆందోళనలకు గురిచేసే కుట్రలు చేశాయని ఆరోపిం చారు. ప్రభుత్వం మాత్రం ఎలాంటి ఆంక్షలు లేకుండా, సాగుభూమికి రూ.12వేలు ఏడాదికి ఇచ్చేలా జనవరి 26 నుంచి పథకం అమలుకు సిద్ధం అవుతోందన్నారు. సన్నవడ్లకు కూడా రూ.500 బోనస్ ఇస్తున్న ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ధర్మపురి, బీర్‌పూర్ మండలాలకు సాగునీరు అందించే రోళ్లవాగు ఆధునీకరణ సైతం ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సమస్యలు పరిష్కరించామన్నారు. గోదావరి నదిలో డిసెంబర్, జనవరిలోనే నీరు లేకపోవడంతో లిఫ్ట్‌లపై ఆధారపడ్డ రైతుల దుస్థితి ప్రశ్నార్థకంగా మారిందని దీంతో 11,946 ఎకరాలకు నీరందే అవకాశం లేకుండా పోయిందన్నారు. ప్రస్తుతం అవసరం ఉన్న సాగుకు ఒక టీఎంసీ నీటిని విడుదల చేస్తే, సుమారు 12వేల ఎ కరాలకు సాగు నీరు అందుతుందని త్వరలోనే నీరు వి డుదలయ్యి ఇబ్బందులు తొలగుతాయన్నారు. గత అ నంతరం ప్రభుత్వ విప్. ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గోదావరిలో నీరులేకపోవడంతో ఎత్తిపోతలపై ఆధారపడ్డ రైతులకు ఇబ్బంది ఏర్పడిం దని, కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష నిర్వ హించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లా మన్నారు. రైతులను ఆదుకోవాలనే సంకల్పంతో ఎమ్మె ల్సీ జీవన్‌రెడ్డి తన అనుభవంతో పంటల సాగుకు నీ టి విడుదలకు ఇంజనీయర్లు, అధికారులను ఒప్పించి, మెప్పించి నీటి విడుదలకు కృషి చేశారన్నారు. జగి త్యాల, ధర్మపురి నియోజకవర్గంలో రైతులను ఆదుకు నేందుకు 11,496 ఎకరాల సాగుకు ఒక టీఎంసీ నీటి విడుదలకు సహకరించిన సీఎం రేవంత్‌రెడ్డికి, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమా వేశంలో టీపీసీసీ రాష్ట్ర బాధ్యులు బండ శంకర్, ము న్సిపల్ ఫ్లోర్ లీడర్ దుర్గయ్య, మండల బ్లాక్ ప్రెసిడెం ట్ పొలాస నందయ్య, మండలాధ్యక్షుడు జున్ను రా జేందర్, పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్, మాజీ కౌన్సి లర్ పుప్పాల అశోక్, రాధాకిషన్‌రావు, పూర్ణచందర్‌రెడ్డి, స్వామిరెడ్డి, శైలేందర్‌రెడ్డి, శేఖర్ పాల్గొన్నారు.
Updated Date - Jan 12 , 2025 | 01:36 AM