గడ్డల యూరియా ఏం చేసుకోవాలి?
ABN, Publish Date - Jan 11 , 2025 | 11:37 PM
యాసంగి నాట్లతో ఊపందుకున్న వ్యవసాయ పనుల్లో రైతులు తీరికలేకుండా బిజీ బిజీగా గడుపుతున్నారు. ఓ వైపు కూలీల కొరత మరోవైపు సంక్రాంతి పండుగ సమీపిస్తుంటే త్వరితగతిన వ్యవసాయ పనులను ముగించుకోవాలనే ఆతృత అన్నదాతలను పరుగులు పెట్టిస్తోంది.
ఆగ్రోస్ ద్వారా సరఫరా
ఇప్పటికే 10వేల మెట్రిక్ టన్నుల యూరియా గడ్డలుగా మారిన వైనం
తమకేం సంబంధం లేదంటున్న ఫర్టిలైజర్ వ్యాపారులు
పొలంలో చల్లలేక ఇబ్బంది పడుతున్న అన్నదాతలు
పట్టించుకోని అధికారులు
లింగాలఘణపురం, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): యాసంగి నాట్లతో ఊపందుకున్న వ్యవసాయ పనుల్లో రైతులు తీరికలేకుండా బిజీ బిజీగా గడుపుతున్నారు. ఓ వైపు కూలీల కొరత మరోవైపు సంక్రాంతి పండుగ సమీపిస్తుంటే త్వరితగతిన వ్యవసాయ పనులను ముగించుకోవాలనే ఆతృత అన్నదాతలను పరుగులు పెట్టిస్తోంది. పొలంలో నత్రజని సమతుల్యత కోసం వినియోగించేందుకు ప్రభుత్వం రైతుల కోసం సబ్సిడీపై యూరియాను ప్రతీ సీజన్‌కు మార్క్‌ఫెడ్ ద్వారా రైతులకు అందజేస్తోంది. దీంతో ప్రభుత్వం సరఫరా చేసే యూరియా సంచులు పూర్తిగా గడ్డలుగా మారిపోయి రైతులకు ఇబ్బందిగా మారుపోతోంది. ప్రస్తుతం మార్క్‌ఫెడ్ ద్వారా సరఫరా చేసిన యూరియాను విక్రయించే ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల్లో లభించే యూరియా మొత్తం జనగామ జిల్లా వ్యాప్తంగా గడ్డ కట్టుకుపోవడం గమనార్హం. అయితే గడ్డలు కట్టిన యూరియాను తాము ఏం చేసుకోవాలని రైతులు ఫర్టిలైజర్ వ్యాపారులను ప్రశ్నిస్తే తాము ఏం చేయలేమని మార్క్‌ఫెడ్ ద్వారా వచ్చే యూరియా మొత్తం 10వేల మెట్రిక్ టన్నులు గడ్డల మయంగా మారిపోయిం దని వ్యాపారులు రైతులకు బదులిస్తున్నారు. ఓ వైపు నాట్ల సీజన్ దాటిపోతుండగా విధిలేని పరిస్థితుల్లో రైతులు గడ్డలు కట్టిన యూరియాను కొనుగోలు చేస్తున్నా మని ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. ఈవిషయమై లింగాల ఘణపురం వ్యవసాయా ధికారి వెంటకేశ్వర్లును ఆంధ్రజ్యోతి వివరణ కోరగా.. యూరియా గడ్డలు కట్టిన విష యాన్ని ఉన్నతాధి కారులకు సమాచారం ఇచ్చామని ఇక నుంచి గడ్డలుగా లేని యూరియాను తెప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
గడ్డల యూరియాతో ఇబ్బందులు..
- సంగి బాలరాజు, రైతు గుమ్మడవెల్లి
నాట్ల సీజన్ ముగిసిపో తుంటే పొలంలో వేసేందుకు యూరియాను కొనుగోలు చేద్దామని ఫెర్టిలైజర్ షాపుకు వస్తే వందల సంచుల యూరి యా గడ్డల మయంగా ఉంది. ఈ గడ్డల యూరియాను తాము కొనుగోలు చేసి ఏం చేసుకోవాలో అర్థం కావడం లేదు. విధిలేని పరిస్థితుల్లో గడ్డల యూరియాను తీసుకెళ్తున్నాము. అధికారులు మంచి నాణ్యమైన యూరియాను సరఫరా చేసి రైతులకు సహకరించాలి.
Updated Date - Jan 11 , 2025 | 11:38 PM