ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తెల్లారిన బతుకులు

ABN, Publish Date - Jan 11 , 2025 | 12:50 AM

తెల్లవారుజామున మంచు కురుస్తూ నిర్మానుష్యంగా ఉన్న జాతీయ రహదారి ఒక్కసారిగా రక్తసిక్తమైంది.

ప్రమాదానికి గురైన ట్రావెల్స్‌ బస్సు

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు

మంచు కురుస్తుండగా అతివేగంగా వచ్చిన బస్సు

ఐదుగురు వలస కూలీల మృత్యువాత... మృతుల్లో దంపతులు

10 మందికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం

మృతులంతా ఒడిశా రాష్ర్టానికి చెందిన వారే

చివ్వెంల, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): తెల్లవారుజామున మంచు కురుస్తూ నిర్మానుష్యంగా ఉన్న జాతీయ రహదారి ఒక్కసారిగా రక్తసిక్తమైంది. టైరు పేలి రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందగా, 10మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో భార్యాభర్తలు, ఓ మహిళ, వృద్ధుడు, డ్రైవర్‌ ఉన్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం తెల్లవారుజామున సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని ఐలాపురం గ్రామ స్టేజీ సమీపంలో ఖమ్మం-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్‌ఐ వల్లపు మహేశ్వర్‌ తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం కోరాపూట్‌ జిల్లాకు చెందిన 32మంది హైదరాబాద్‌లో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేసి కుటుంబాలను పోషించుకుంటున్నారు. పనులు ముగియడంతో రెండు నెలల క్రితం వారు సొంత రాష్ట్రానికి వెళ్లారు. హైదరాబాద్‌లోని కోఠి, జీడిమెట్ల ప్రాంతాల్లో పనులు ప్రారంభం కావడంతో భవన నిర్మాణ పనులు చేయడానికి తిరిగి గురువారం ఉదయం ఛత్తీస్‌ఘడ్‌ రాష్ర్టానికి చెందిన ఓ ట్రావెల్‌ బస్సులో హైదరాబాద్‌కు బయలుదేరారు.

మంచు కురిసె... అతివేగం...

మొత్తం 800కిలోమీటర్ల ప్రయాణం కాగా 12గంటల్లో హైదరాబాద్‌ చేరుకోవాల్సి ఉంది. బస్సు నడిపేందుకు ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. ఒడిశా నుంచి ఛత్తీస్‌ఘడ్‌ వరకు ఒక డ్రైవర్‌ వాహనం నడపగా, ఛత్తీస్‌ఘడ్‌ నుంచి సునిల్‌ గోర్ధ వాహనం నడుపుతున్నాడు. మరో రెండున్నర గంటల్లో హైదరాబాద్‌ చేరుకోవల్సి ఉండగా, బస్సు ఖమ్మం జిల్లా దాటి సూర్యాపేట జిల్లాకు చేరుకుంది. చివ్వెంల మండల పరిధిలోని ఐలాపురం గ్రామ స్టేజీ వద్ద జాతీయ రహదారి పక్కన ఓ ఇసుక లారీ టైర్‌ పేలటంతో పక్కన నిలిపి ఉంచాడు. అదే సమయంలో మంచు కురుస్తుండటంతో, 10 నిమిషాల అనంతరం అదే దారిలో వచ్చిన ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ వెనుకనుంచి లారీని బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందగా, వెనుకగా ఉన్న సీట్లలో కూర్చున్న ప్రయాణికులు చెల్లాచెదురయ్యారు. ఈ ప్రమాదంలో ఒడిశా రాష్ట్రం కోరాపుట్‌కు చెందిన దంపతులు రూపు హరిజన్‌(51), సూల హరిజన్‌(46), సునమణి హరిజన్‌(61), ప్రత్యుష్‌ ప్రభాత్‌ హరిజన్‌(17), నబరంగపూర్‌ జిల్లాకు చెందిన లహరికన్ని గ్రామానికి చెందిన బస్సు డ్రైవర్‌ సునిల్‌ గోర్ధ(37) మృతిచెందారు. మరో 10మందికి గాయాలుకాగా, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ోడ్డు ప్రమాద ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బస్సులో ఇరుక్కున్న ఐదుగురి మృతదేహాలను బయటికి తీయించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌ ద్వారా సూర్యాపేట జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. బస్సులో ఉన్న 17మంది ప్రయాణికులు మృతదేహాలను, క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించే సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ప్రమాదంతో అక్కడ గంటకు పైగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. సూర్యాపేట డీఎస్పీ రవి ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. రెండు వాహనాలను ప్రొక్లెయినర్ల సహాయంతో పక్కకు తొలగించారు. జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల సంబంధీకుడు తల్వాడ లాభ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వల్లపు మహేశ్వర్‌ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.

డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమా?

ట్రావెల్‌ బస్సు-లారీని ఢీకొన్న ప్రమాదంలో రెండు వాహన డ్రైవర్ల నిర్లక్ష్యం ఉందని అధికారులు భావిస్తున్నారు. టైరు పేలడంతో లారీని రోడ్డు పక్కకు నిలిపే సమయంలో లారీ డ్రైవర్‌ ఎలాంటి జాగ్రత్తలు పాటించలేదని తెలుస్తోంది. దీంతో చలికాలం కావడం, మంచు కురుస్తుండటం, బస్సు డ్రైవర్‌ అతివేగంగా రావడంతోనే ఆగి ఉన్న లారీని ఢీకొట్టి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

క్షతగాత్రులు వీరే..

మంజీ బోజ్‌నాధ్‌, చత్తీస్‌ఘడ్‌ రాష్ర్టానికి చెందిన రెండో బస్సు డ్రైవర్‌ లవాంగ్‌ దినేష్‌, రూప్‌దర్‌ బంజారాలతో పాటు మరో ఏడుగురు కూలీలకు గాయాలయ్యాయి. వారిలో ఇద్ద కూలీల పరిస్థితి విషమంగా ఉంది.

గంటకు పైగా ట్రాఫిక్‌ జామ్‌

ఖమ్మం- హైదరాబాద్‌ రహదారిపై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగా సుమారు గంటకు పైగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సూర్యాపేట డీఎస్పీ రవి ఆధ్వర్యంలో సీఐ రాజశేఖర్‌, ఎస్‌ఐలు వల్లపు మహేశ్వర్‌, బాలునాయక్‌ సంఘటనా స్థలానికి సిబ్బందితో చేరుకుని క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో సూర్యాపేట జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వాహనాలను ఎక్సవేటర్‌ సహాయంతో రోడ్డు పక్కకు జరిపి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

డివైడర్‌పై కాలు... భయభ్రాంతులకు గురైన స్థానికులు

రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తికి ఓ కాలు విరిగి పక్కకు పడిపోయింది. దానిని గమనించని పోలీసులు మృతదేహాలను ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పడిపోయిన కాలును ఓ లారీ డ్రైవర్‌ పోలీస్‌ సిబ్బందికి చెప్పకుండా జాతీయ రహదారి డివైడర్‌ మధ్యలో వేశాడు. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ కాలును ఒక కవర్‌లో పెట్టి జనరల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతుని పట్ల కనికరం లేకుండా శరీర భాగాన్ని కనబడకుండా డివైడర్‌లో వేయడం పట్ల స్థానికులు అసహనం వ్యక్తం చేశారు.

ఇంటికి వస్తూ అనంతలోకాలకు..

నాగారం, కొడకండ్ల జనవరి 10(ఆంధ్రజ్యోతి): జనగామ జిల్లాలో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఈటూరు గ్రామా నికి చెందిన పేరాల వెంకన్న(45), పేరాల లక్ష్మి(35) అక్కడికక్కడ మృతి చెందగా పేరాల ఉషయ్య, లావణ్య, ఉప్పలమ్మ, ముత్యాలు, వంగూరి నరసమ్మలకు తీవ్రగాయాలయ్యాయి. పాలకుర్తి సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడ వెండిలో పేరాల వెంకన్న చిన్నకొడుకు కొడుకు డోలా రోహణ ఫంక్షన్‌ గురువారం జరిగింది. ఈటూరుకు చెందిన బంధువులు ఈ వేడుకలకు హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో తుఫాన్‌ వాహనం ఎక్కారు. డ్రైవర్‌ ప్యాసింజర్లను ఎక్కించుకున్నాడు. తిరుమలగిరి వైపు వెళ్తున్న తుఫాన్‌ వాహనం అర్ధరాత్రి సుమారు 11.40గంటల సమయంలో కొడకండ్ల మండలంలోని మైదంచెరువుతండా సమీపంలో ఇనుప రేకుల లోడ్‌తో ఉన్న డీసీఎం వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఊటూరుకు చెందిన పేరాల వెం కన్న(45), అతడి తమ్ముడి భార్య పేరాల లక్ష్మి(35) ఘటనా స్థలంలోనే మృతిచె ందారు. పేరాల ఉషయ్య, లావణ్య, ఉప్పలమ్మ, ముత్యాలు, వంగూరి నరసమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హైదరాబాద్‌ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. మిగతావారు క్షేమంగా ఉన్నట్లు సమా చారం. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో తుఫాన్‌ వాహనంలో 12మంది ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఆస్పత్రికి తరలించారు. వెంకన్న కుమారుడు పేరాల రాజు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రాజు కేసు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఈటూరులో విషాదఛాయలు

జనగాం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నాగారం మండలం ఈటూరు గ్రామానికి పేరాల వెంకన్న, జ్యోతి మృతదేహాలను జనగాం జిల్లా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులు శుక్రవారం స్వగ్రామానికి తీసుకొచ్చారు. మృతుల బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఈటూరు గ్రామానికి చేరుకుని పేరాల వెంకన్న, జ్యోతిలకు మృతదేహాలపై పులమాల వేసి నివాళులర్పించారు.

Updated Date - Jan 11 , 2025 | 12:50 AM