Cricket betting: క్రికెట్ బెట్టింగ్‌కు మరో యువకుడి బలి
ABN, Publish Date - Apr 06 , 2025 | 05:01 AM
క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్న ఓ యువకుడు మనస్తాపంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సికింద్రాబాద్ సనత్‌నగర్ సమీపంలో జరిగింది.

డబ్బు పోగొట్టుకొని రైలు కింద పడి ఆత్మహత్య
సికింద్రాబాద్ సనత్‌నగర్ సమీపంలో ఘటన
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్న ఓ యువకుడు మనస్తాపంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సికింద్రాబాద్ సనత్‌నగర్ సమీపంలో జరిగింది. సికింద్రాబాద్ సుచిత్ర ప్రాంతానికి చెందిన రజ్వీర్‌సింగ్ (25) ప్రైవేట్ ఉద్యోగి. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో సుచిత్ర వద్ద ఉంటున్న బాబాయి ఇంట్లో ఉంటున్నాడు. కొంత కాలంగా ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ తన వద్ద ఉన్న డబ్బు మొత్తం పోగొట్టుకొని తాగుడికి బానిసయ్యాడు.
తెలిసిన వ్యక్తుల వద్ద డబ్బు తీసుకుని అది కూడా బెట్టింగ్ వేసి పొగొట్టుకున్నాడు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన రజ్వీర్‌సింగ్ సనత్‌నగర్, అమ్ముగూడ రైల్వే స్టేషన్‌ల మార్గమధ్యలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహన్ని గాంధీ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Apr 06 , 2025 | 05:01 AM