ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణలు..

ABN, Publish Date - Jan 10 , 2025 | 09:47 PM

తిరుపతి తొక్కిసలాట ఘటనపై పిఠాపురం వేదికగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) శుక్రవారం హాట్ కామెంట్స్ చేశారు. తిరుపతి (Tirupati) తొక్కిసలాట ఘటన ఎంతో బాధించిందని పవన్ చెప్పారు.

తిరుపతి: నగరంలో తొక్కిసలాట ఘటనపై పిఠాపురం వేదికగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) శుక్రవారం హాట్ కామెంట్స్ చేశారు. తిరుపతి (Tirupati) తొక్కిసలాట ఘటన ఎంతో బాధించిందని పవన్ చెప్పారు. ఈ వ్యవహారంలో టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu), ఈవో శ్యామలరావు, అధికారులు కచ్చితంగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. తానే స్వయంగా క్షమాపణలు చెప్పానని, తనకు లేని నామోషీ టీటీడీ అధికారులకు ఎందుకంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే శుక్రవారం ఉదయం మీడియా ముందుకు వచ్చిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తాను క్షమాపణలు చెప్తే పోయిన ప్రాణాలు వస్తాయా? అని ప్రశ్నించారు. ఆ తర్వాత మరికొద్దిసేపటికి మళ్లీ మీడియా సమావేశం పెట్టిన బీఆర్ నాయుడు.. టీటీడీ బోర్డు తప్పులేకపోయినా పాలకమండలి తరఫున క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు.

Updated Date - Jan 10 , 2025 | 09:47 PM