చిచ్చురేపిన మార్కెట్ కమిటీ ఛైర్మన్ల నియామకం..

ABN, Publish Date - Apr 05 , 2025 | 10:41 PM

ఆంధ్రప్రదేశ్‌లో మార్కెట్ కమిటీ ఛైర్మన్ల నియామక వ్యవహారం టీడీపీలో చిచ్చురేపింది. తాము సూచించిన వారికి పదవులు వస్తాయని భావించిన ఎమ్మెల్యేలు.. జాబితా చూసి షాక్ అయ్యారు. దీంతో వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మార్కెట్ కమిటీ ఛైర్మన్ల నియామక వ్యవహారం టీడీపీలో చిచ్చురేపింది. తాము సూచించిన వారికి పదవులు వస్తాయని భావించిన ఎమ్మెల్యేలు.. జాబితా చూసి షాక్ అయ్యారు. దీంతో వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. టీడీపీ శుక్రవారం 38 మంది మార్కెట్ యాడ్ ఛైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో ఆరు జనసేన, ఒకటి బీజేపీ, మిగిలిన 31 టీడీపీ నేతలకు ఇచ్చారు. జనసేన ఇచ్చిన జాబితా ప్రకారం ఆయా నియోజకవర్గాల్లో ఛైర్మన్లను నియమించారు. అయితే జనసేన నుంచి ఛైర్మన్లను నియమించే సమయంలో తమకు ముందే చెప్పి ఉంటే బావుండేదని టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Apr 05 , 2025 | 10:41 PM