పిఠాపురానికి పవన్ బంపర్ ఆఫర్
ABN, Publish Date - Jan 12 , 2025 | 01:13 PM
విజయవాడ: నగరంలో బుక్ ఫెయిర్‌ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సందర్శించారు. దాదాపు రెండు గంటలపాటు పలు పుస్తక కేంద్రాలకు వెళ్లి తెలుగు సాహిత్యానికి సంబంధిచిన పుస్తకాలను పరిశీలించారు. ప్రముఖ రచితల నుంచి యువ రచితల వరకు పలువురి రచనలను పరిశీలించారు.
విజయవాడ: నగరంలో బుక్ ఫెయిర్‌ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సందర్శించారు. దాదాపు రెండు గంటలపాటు పలు పుస్తక కేంద్రాలకు వెళ్లి తెలుగు సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలను పరిశీలించారు. ప్రముఖ రచితల నుంచి యువ రచితల వరకు పలువురి రచనలను పరిశీలించారు. అలాగే ప్రాచీన సాహిత్యంపై వెలువరించిన విశ్లేషణలు, పరిశీలన పుస్తకాలను ఎంచుకున్నారు. అనువాద సాహిత్య పుస్తకాలు నిఘంటువులు, ఆధ్యాత్మిక సంబంధిత రచనలను పరిశీలించి మొత్తంగా రూ. 10 లక్షలు విలువ చేసే పుస్తకాలను కొనుగోలు చేశారు.
పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో అధునాతన సౌకర్యాలతో లైబ్రరీ నిర్మాణం ఏర్పాటు చేస్తున్నారు. ఆ గ్రంధాలయంలో ఈ పుస్తకాలు ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జనవరి 2న పుస్తకమహోత్సవం ప్రారంభించి పుస్తక పఠనం ద్వారా కలిగే ప్రయోజనాలను, వ్యక్తిగతంగా తనకు కలిగిన మేలును ఆయన వివరించారు. ఇప్పుడు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురంలో యువతకు పుస్తక పఠనం అలవాటు చేసేలా లైబ్రరీ ఏర్పాటు చేయబోతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మరోసారి ఎమ్మెల్యే దానం నాగేందర్ హాట్ కామెంట్స్
మృతుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ...
కరీంనగర్ జిల్లా: నీట మునిగిన ఎస్సీ కాలనీ..
రోజా నోరు అదుపులో పెట్టుకోవాలి: జేసీ ప్రభాకర్‌రెడ్డి
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jan 12 , 2025 | 01:50 PM