బీజేపీలో అలకలు.. అసంతృప్తులు..
ABN, Publish Date - Apr 16 , 2025 | 09:50 AM
ఇటీవల నిజామాబాద్ ఎంపీ అరవింద్ జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్ కుమార్‌తో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ కారణంగానే అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియటంలేదని బీజేపీ నేత శ్రావణి తన సన్నిహితులవద్ద ఆందోళన వ్యక్తం చేశారు.
నిజామాబాద్: క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీ (BJP)లో ఈ మధ్య అలకలు.. అసంతృప్తులు, గ్రూపులు, గొడవలు, కలహాలు కామన్ అయ్యాయి. గతంలో విబేధాలు ఉంటే అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకునేవారు. కానీ ఇప్పుడు బహిరంగంగానే తమ మనసులోని విషయాలను చెప్పేస్తున్నారు. జగిత్యాల (Jagityal)లో ప్రస్తుతం ఇదే జరుగుతోంది. ఇక్కడ బీజేపీ ఇన్చార్జ్ శ్రావణి (Sravani) కొంత కాలంగా సైలెంట్‌గా ఉంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత దూకుడు బాగా తగ్గింది. ఇన్నాళ్లు శ్రావణికి అండగా ఉన్న నిజామాబాద్ (Nizamabad) ఎంపీ అరవింద్ (MP Arvind) కూడా ప్రాధాన్యత తగ్గించినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. తన ప్రత్యర్థులకు అరవింద్ అధిక ప్రయారిటీ ఇవ్వడంతో జగిత్యాల బీజేపీ ఇన్చార్జ్ కొంత అసంతృప్తితో ఉన్నారని వినిపిస్తోంది. ఇటీవల అరవింద్ జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్ కుమార్‌తో (MLA Sanjeev Kumar) వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ కారణంగానే అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియటంలేదని శ్రావణి తన సన్నిహితులవద్ద ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read..: పబ్లిసిటీ కోసం వెళ్లి.. కటకటాల్లోకి...
ఈ వార్తలు కూడా చదవండి..
కల్తీ కల్లు మాఫియా.. ప్రాణాలతో చెలగాటం..
ఈడీ విచారణకు పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్
For More AP News and Telugu News
Updated at - Apr 16 , 2025 | 09:50 AM