తమిళనాడులో ఈడీ సోదాలు కలకలం..
ABN, Publish Date - Apr 07 , 2025 | 02:00 PM
మున్సిపల్ పరిపాలన, పట్టాణాభివృద్ధి, నీటిసరఫరా శాఖకు చెందిన మంత్రి కేఎన్ నెహ్రూ కుటుంబ సభ్యులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు పెద్ద ఎత్తున దర్యాప్తు ప్రారంభించారు. ఆర్థిక లావాదేవీల్లో అక్రమాలు జరిగినట్లు వచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నారు.

చెన్నై: తమిళనాడులో ఈడీ (ఎన్‌ఫోర్స్‌నమెంట్ డైరెక్టరేట్) సోదాలు (ED Raids) రాజకీయ కలకలం (Political News) రేపాయి. మంత్రి కేఎన్ నెహ్రూ (K.N. Nehru) ఆయన కుమారుడు, లోక్ సభ సభ్యుడు అరుణ్ నెహ్రూ (Arun Nehru)కు సంబంధించిన నివాసాల్లో ఈడీ సోదాలు జరుపుతోంది. దీంతో ఇరునేతల మద్దతుదారులు పెద్ద సంఖ్యలో వారి ఇళ్ల వద్దకు చేరుకున్నారు. సోమవారం తెల్లవారుజామున ఈడీ అధికారులు నెహ్రూకు సంబంధించిన నివాసాలకు చేరుకున్నారు. మంత్రి నెహ్రూ సోదరుడు ఎన్ రవిచంద్రన్‌కు (N. Ravichandran) చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ.. ట్రూ వాల్యూ హోమ్స్‌లో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఈడీ అధికారులు తెలిపారు. దానికి సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Also Read..: రోడ్డు ప్రమాదం..డిప్యూటీ కలెక్టర్ మృతి
ఈ వార్తలు కూడా చదవండి..
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం..
చంద్రబాబుతో చేసిన ఛాలెంజ్ నిలబెట్టుకున్నా..: లోకేష్
శంకరయ్య హత్య కేసు మిస్టరీని చేధించిన పోలీసులు..
For More AP News and Telugu News
Updated Date - Apr 07 , 2025 | 02:00 PM