తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టిన వర్షం..

ABN, Publish Date - Apr 03 , 2025 | 07:10 PM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో హైదరాబాద్ నగరాన్ని వాన ముంచెత్తింది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో హైదరాబాద్ నగరాన్ని వాన ముంచెత్తింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడి పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. ఈ భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రజలు ఇళ్లకు వెళ్లేందుకు నానావస్థలు పడ్డారు. కాగా, పలు ప్రాంతాల్లో మరికొన్ని గంటలపాటు వర్షం కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Updated Date - Apr 03 , 2025 | 07:10 PM