అటు ఈడీ.. ఇటు ఏసీబీ...
ABN, Publish Date - Jan 08 , 2025 | 12:09 PM
హైదరాబాద్: అటు ఈడీ.. ఇటు ఏసీబీ... ఫార్ములా ఈ కార్ రేసు కేసులో దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఈ కేసులో అప్పటి పురపాలక ప్రత్యేక కార్యదర్శి అర్వింద్ కుమార్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ముగ్గురు ఏసీబీ అధికారులు అర్వింద్ కుమార్‌ను ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్: అటు ఈడీ.. ఇటు ఏసీబీ... ఫార్ములా ఈ కార్ రేసు కేసులో దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఈ కేసులో అప్పటి పురపాలక ప్రత్యేక కార్యదర్శి అర్వింద్ కుమార్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ముగ్గురు ఏసీబీ అధికారులు అర్వింద్ కుమార్‌ను ప్రశ్నిస్తున్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించి హెచ్ఎండీఏ సీఈ బీఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. బీఎల్ఎన్ రెడ్డి స్టేట్‌మెంట్‌ను ఈడీ అధికారులు రికార్డు చేయనున్నారు. మరోవైపు కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్‌కు అనుమతించిన హైకోర్టు మధ్యాహ్నం విచారణ చేయనుంది. ఈ ఫార్ములా కేసులో ఏసీబీ విచారణలో లాయర్‌ను అనుమతించాలని కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ డిజిటల్ టెక్నాలజీ సదస్సు..
చంద్రబాబు, పవన్‌పై ఎంపీ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు
కుంభమేళాకు బయలుదేరిన శ్రీవారి కళ్యాణరథం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jan 08 , 2025 | 12:09 PM