ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని ఈడ్చుకెళ్లిన పోలీసులు..

ABN, Publish Date - Jan 12 , 2025 | 05:19 PM

తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన రసాభాసగా మారింది. కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్ కొట్టుకున్నారు.

కరీంనగర్: తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన రసాభాసగా మారింది. కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్ కొట్టుకున్నారు. సమావేశం సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడేందుకు లేచారు. అయితే ఆయనకు ఎవరు మైక్ ఇచ్చారంటూ పక్కనే కూర్చున కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ పైకి దురుసుగా వెళ్లారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం కాస్త ముదిరి పరస్పరం దాడులకు దారి తీసింది. జిల్లా సమీక్షా సమావేశంలో ప్రభుత్వ పథకాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఎమ్మెల్యే సంజయ్‌ మాట్లాడే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన కౌశిక్ రెడ్డి నువ్వు ఏ పార్టీ అంటూ సంజయ్‌ను ప్రశ్నించారు. దమ్ముంటే కాంగ్రెస్ టికెట్‌పై గెలవాలని సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బయటకు ఈడ్చుకెళ్లారు.

Updated Date - Jan 12 , 2025 | 06:02 PM