ఏం కౌశిక్..నువ్వు పార్టీ మారలేదా..?
ABN, Publish Date - Jan 13 , 2025 | 09:01 PM
MLA Sanjay Vs KOushik : తాను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నందుకే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అక్కసు ప్రదర్శిస్తున్నాడని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో కౌశిక్ రెడ్డి పని చేశారని గుర్తు చేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‍చార్జీగా పని చేశారని చెప్పారు. ఆ సమయంలో 12 మంది ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారన్నారు. అలాగే వారిలో పలువురు మంత్రి పదవులు సైతం చేపట్టారని తెలిపారు. మరి ఆ సమయంలో మీరు ఎందుకు మాట్లాడ లేదంటూ కౌశిక్ రెడ్డిని డాక్టర్ సంజయ్ సూటిగా ప్రశ్నించారు. ఆ తర్వాత అధికారం కోసం బీఆర్ఎస్ పార్టీలో చేరింది వాస్తవం కాదా అని నిలదీశారు. దీంతో కౌశిక్ రెడ్డి నేపథ్యం ఏమిటన్నది అందరికి తెలిసిందేనని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ స్పష్టం చేశారు.
తాను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నందుకే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అక్కసు ప్రదర్శిస్తున్నాడని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో కౌశిక్ రెడ్డి పని చేశారని గుర్తు చేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‍చార్జీగా పని చేశారని చెప్పారు. ఆ సమయంలో 12 మంది ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారన్నారు. అలాగే వారిలో పలువురు మంత్రి పదవులు సైతం చేపట్టారని తెలిపారు. మరి ఆ సమయంలో మీరు ఎందుకు మాట్లాడ లేదంటూ కౌశిక్ రెడ్డిని డాక్టర్ సంజయ్ సూటిగా ప్రశ్నించారు. ఆ తర్వాత అధికారం కోసం బీఆర్ఎస్ పార్టీలో చేరింది వాస్తవం కాదా అని నిలదీశారు. దీంతో కౌశిక్ రెడ్డి నేపథ్యం ఏమిటన్నది అందరికి తెలిసిందేనని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ స్పష్టం చేశారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jan 13 , 2025 | 09:01 PM