ఇద్దరు మైనర్లతో వివాహం.. రంగంలోకి అధికారులు

ABN, Publish Date - Apr 09 , 2025 | 02:00 PM

ఇద్దరు మైనర్లు అయిన అక్కా చెల్లెళ్లకు ఇవాళ వివాహం జరగనుంది. సమాచారం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు సంఘటన ప్రదేశానికి వెళ్లి మైనర్లకు వివాహం జరపడం చట్ట విరుద్ధమని ఇరు కుటుంబ సభ్యులకు అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో వివాహం వాయిదా పడింది. అయితే..

శ్రీ సత్యసాయి జిల్లా: ఇద్దరు మైనర్లతో జరిగే వివాహాన్ని (Minors Marriage) ఐసీడీఎస్ అధికారులు (ICDS officials) అడ్డుకున్నారు. కర్ణాటక రాష్ట్రం (Karnataka State) చిక్బల్లాపూర్‌కు (Chikkaballapur) చెందిన అక్కా చెల్లెళ్లతో గుమ్మయ్యగారి పల్లెకు చెందిన యువకుడికి గత నెల నిశ్చితార్థం జరిగింది. ఇవాళ ఇద్దరి అమ్మాయిలతో వివాహం జరగాల్సి ఉంది. మైనర్లు అయిన అక్కా చెల్లెళ్లతో యువకుడి పెళ్లి పత్రిక (wedding invite) సోషల్ మీడియాలో(Social Vedia) వైరల్ (Viral) అయింది. ఈ విషయం ఐసీడీఎస్ అధికారుల దృష్టికి వెళ్లడంతో మైనర్లకు వివాహం జరపడం చట్ట విరుద్ధమని ఇరు కుటుంబ సభ్యులకు అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో వివాహం వాయిదా పడింది. అయితే తాము మేజర్లముంటూ అక్కా చెల్లెళ్లు వాదించగా సర్టిఫికేట్లు పరిశీలించామని.. దీంతో వారు మైనర్లని తేలిందని అధికారులు తెలిపారు. వారు వినకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించినట్లు అధికారులు చెప్పారు.

Also Read..: నా జుట్టు విష్ణు చేతికి వెళ్ళాలన్నది అతని లక్ష్యం..


ఈ వార్తలు కూడా చదవండి..

వైద్యుల పర్యవేక్షణలో మార్క్ శంకర్..

చంద్రబాబు కొత్త ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన

గుంటూరు అవతలవారిని నరికేస్తాం.. ఇవతలవారిని లాక్కొచ్చి కొడతాం

For More AP News and Telugu News

Updated at - Apr 09 , 2025 | 02:00 PM