ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మైనార్టీలకు ప్రధాని మోదీ కానుక..

ABN, Publish Date - Mar 26 , 2025 | 11:16 AM

మైనార్టీలపై ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ.. వారిని ఆకట్టుకోవడం కోసం సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. పండుగ సందర్భంగా మైనార్టీలకు కానుక ఇచ్చేందుకుగాను సౌగత్ ఎ మోదీ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.

ఇంటర్నెట్‌ డెస్క్: మైనార్టీలను ఆకర్షించడం కోసం బీజేపీ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. పండుగల వేళ వారికి కానుక ఇవ్వడం కోసం సౌగత్ ఎ మోదీ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. త్వరలోనే రానున్న రంజాన్ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ముందుగా ఈ కార్యక్రమాన్ని దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో ప్రారంభించనున్నారు. ఈ ప్రాంతంలోని ముస్లింలకు రంజాన్ సందర్భంగా సౌగాత్ కిట్ అందివ్వనున్నారు. ఈకిట్‌లో సేమియా, ఖర్జూరం, డ్రైఫ్రూట్స్, పంచదార వంటి ఆహారపదార్థాలతో పాటుగా పురుషులు, స్త్రీల కోసం రూ.500-రూ.600 విలువ చేసే కుర్తా-పైజామా/సల్వార్-కమీజ్ దుస్తులు ఉండనున్నాయి. ఈ రంజాన్ సందర్భంగా దేశం మొత్తం మీద 32 లక్షల మంది పేద ముస్లింలకు ఈ కిట్లను అందజేస్తామని బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు జమాల్‌ సిద్దికీ తెలిపారు. దేశంలోని 32 వేల మసీదుల సహకారంతో.. మైనార్టీ మోర్చాకు చెందిన 32 వేల మంది కార్యకర్తలు ఈ కిట్‌లను పంపిణీ చేస్తారని తెలిపారు.

Updated Date - Mar 26 , 2025 | 11:18 AM