షీ జిన్ పింగ్‌పై సంచలన నివేదిక..
ABN, Publish Date - Mar 26 , 2025 | 02:02 PM
చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ఇప్పుడు అవినీతి ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆయన బంధువులు, కుటుంబసభ్యులకు వందల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు, వ్యాపారాలు ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.
చైనా అధ్యక్షుడు (China President) షీ జిన్ పింగ్ (Xi Jinping) మరోసారి వార్తలో నిలిచారు. అవినీతిని సమూలంగా నిర్మూలిస్తానని, ఉక్కుపాదం మోపుతున్న జిన్ పింగ్ ఇప్పుడు అదే అవినీతి ఆరోపణలతో (Corruption Allegations) ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అక్రమాలకు పాల్పడేవారిపై ఎన్నో కఠిన శిక్షలు విధించి ప్రపంచ వ్యాప్తంగా చర్చగా మారారు. అయితే ఆయన బంధువులు, కుటుంబసభ్యులకు మాత్రం వందల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు, వ్యాపారాలు ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అమెరికాకు చెందిన కొన్ని నిఘా వర్గాలు సమాచారాన్ని వెల్లడించాయి. 2012లో అధికారం చేపట్టిన జిన్ పింగ్ చైనాలో అవినీతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. వ్యాపారవేత్తల నుంచి మధ్య తరగతి వరకు అందరిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మరింత సమాచారం కోసం ఈ వీడియ క్లిక్ చేయండి.
Also Read..: తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ ఎప్పటి వరకు అంటే..
ఈ వార్తలు కూడా చదవండి..
మద్యం స్కాంను తీవ్రంగా పరిగణించిన ఏపీ ప్రభుత్వం
ఎమ్మెల్యే కూనంనేని చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ప్రస్తావన
For More AP News and Telugu News
Updated Date - Mar 26 , 2025 | 02:02 PM