గవర్నర్ల అధికారాలపై సప్రీం స్పష్టత..
ABN, Publish Date - Apr 08 , 2025 | 12:46 PM
గవర్నర్ల అధికారాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు స్పష్టత ఇచ్చింది. గవర్నర్ ఒకసారి తిరస్కరించిన బిల్లును అసెంబ్లీ మళ్లీ ఆమోదించిన తర్వాత రెండోసారి అదే బిల్లును రాష్ట్రపతికి పంపే అధికారం గవర్నర్లకు లేదని సుప్రీం తేల్చి చెప్పింది.
చెన్నై: తమిళనాడు గవర్నర్ (Tamil Nadu Governor) ఆర్ఎన్ రవి (R.N. Ravi)కి సుప్రీం కోర్టు (Supreme Court)లో ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడు ప్రభుత్వం పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు ఎప్పటికీ నిర్ణయం తీసుకోకుండా ఉంచలేరని తీర్పు చెప్పింది. గవర్నర్ ఒకసారి తిరస్కరించిన బిల్లు (Bill)ను అసెంబ్లీ (Assembly) మళ్లీ ఆమోదించిన తర్వాత రెండోసారి అదే బిల్లును రాష్ట్రపతికి పంపే అధికారం గవర్నర్లకు లేదని సుప్రీం తెలిపింది. రాష్ట్ర విశ్వ విద్యాలయాల వైస్‌చాన్సలర్ల నియామకానికి సంబంధించిన బిల్లులను గవర్నర్ రవి ఆమోదించలేదు. దీంతో గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు గవర్నర్ల అధికారాలపై స్పష్టత ఇచ్చింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Also Read..: వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు..
ఈ వార్తలు కూడా చదవండి..
సీతమ్మవారికి తాళి కట్టిన వైసీపీ ఎమ్మెల్యే
సాయంత్రం వేళ ఈ వస్తువులు దానం చేయవద్దు..
For More AP News and Telugu News
Updated at - Apr 08 , 2025 | 12:46 PM