టోల్ ప్లాజా సిబ్బందిపై మహిళ దాడి..

ABN, Publish Date - Apr 15 , 2025 | 06:45 PM

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం హావూర్ జిల్లా చెజార్కీ టోల్ ప్లాజా సిబ్బందిపై ఓ మహిళ దాడి చేసింది. టోల్ అడిగిన కారణంగా సిబ్బందిపై ఆమె రెచ్చిపోయింది. ఫాస్టాగ్ ఖాతాలో డబ్బులు లేకపోవడంతో టోల్ చెల్లించాలని ఉద్యోగి అడిగారు.

ఉత్తర్ ప్రదేశ్: హావూర్ జిల్లా చెజార్కీ టోల్ ప్లాజా సిబ్బందిపై ఓ మహిళ దాడి చేసింది. టోల్ అడిగిన కారణంగా సిబ్బందిపై ఆమె రెచ్చిపోయింది. ఫాస్టాగ్ ఖాతాలో డబ్బులు లేకపోవడంతో టోల్ చెల్లించాలని ఉద్యోగి అడిగారు. దీంతో ఆగ్రహించిన సదరు మహిళ.. టోల్ ప్లాజా క్యాబిన్‍లోకి వెళ్లీ మరీ ఉద్యోగిపై దాడి చేసింది. విచక్షణారహితంగా పిడిగుద్దులు కురిపించింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్‍గా మారాయి. కాగా, ఈ దాడికి పాల్పడిన మహిళపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రం రాజేంద్రనగర్ ఎగ్జిట్-17 టోల్ ప్లాజా వద్ద అలాంటి ఘటనే చోటు చేసుకుంది. నగదు చెల్లించాలని అడిగినందుకు రంగారెడ్డి కలెక్టరేట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న హుస్సేన్ సిద్ధికి టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేశారు. కుటుంబసభ్యులతో కలిసి అడ్డువచ్చిన వారందరినీ విచక్షణారహితంగా కొట్టారు. తననే డబ్బులు అడుగుతావా అంటూ రెచ్చిపోయారు. కాగా, దాడి చేసిన ప్రభుత్వ ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated at - Apr 15 , 2025 | 06:45 PM