ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సొంతపార్టీ ఎంపీపీ కిడ్నీప్..

ABN, Publish Date - Mar 26 , 2025 | 12:25 PM

కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలంలో గురువారం ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో సొంతపార్టీ (వైసీపీ)నేతను ఆ పార్టీ నేతలు కిడ్నాప్ చేశారు. అలాగే ఎంపీటీసీలు కూడా కనిపించకపోవడంపై వారి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

శ్రీసత్యసాయి జిల్లా: కదిరిలో వైసీపీ అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గాండ్లపెంట మండలం ఇన్చార్జ్ ఎంపీపీ గంగోజమ్మను కొంతమంది వైసీపీ నేతలు కిడ్నాప్ చేశారు. ఇప్పటికే ముగ్గురు ఎంపీటీసీలు కూడా కనిపించకపోవడంపై వారి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం గాండ్లపెంట ఎంపీపీ ఎన్నిక ఉండడంతో సర్వత్ర ఉత్కంఠ నెలకున్న తరుణంలో ఎంపీటీసీ సభ్యులు పాల్గొనకుండా చూసేందుకు వైసీపీ కుట్రలకు తెరలేపింది.

Also Read..: ఎమ్మెల్యే కూనంనేని చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ప్రస్తావన


కాగా ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికలను గురువారం నిర్వహిస్తుండటంతో గాండ్లపెంటలో భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ శివనారాయణస్వామి తెలిపారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రాన్ని మంగళవారం పరిశీలించిన ఆయన మాట్లాడారు. మంగళవారం ఉదయం గురువారం సాయంత్రం వరకు గాండ్లపెంటలో 30ఏ యాక్టు, 144 సెక్షన అమల్లో ఉంటాయన్నారు. ప్రజలు గుంపులుగా ఉండకూడదన్నారు. అలాగే ఎన్నిక రోజున పోలింగ్‌ కేంద్రం వద్ద సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఉంటుందన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత

రుయా సెంట్రల్ ల్యాబ్‌లో లైంగిక వేధింపులు

For More AP News and Telugu News

Updated Date - Mar 26 , 2025 | 12:25 PM