Home » 2024
ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయకత్వంలో గ్రామాల్లో రోడ్ల సమస్యలు లేకుండా చేస్తున్నామని ఎమ్మెల్యే పరిటాల సునీతఅన్నారు. మండలంలోని అక్కంపల్లి పంచాయితీ లో మధురానగర్, సదాశివన కాలనీలో ఆదివారం రూ.50లక్షలతో నిర్మిస్తు న్న సీసీరోడ్లకు భూమి పూజ చేపట్టారు. ఎమ్మెల్యే పరిటాల సునీత హాజరై రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు.
మొదటిరోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి బ్రహ్మో త్సవాల్లో భాగంగా ఐదోరోజు ఆదివారం దశకంఠ రావణ బ్రహ్మ వాహనం పై శివపార్వతులు ఊరేగుతూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆల యంలో ఉదయం మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు చేశారు.
రాష్ట్రంలో ఆర్థికం గా వెనుకబడిన వాళ్లను గుర్తించేందుకే ప్రభుత్వం పీ-4 మోడల్ సర్వేను ప్రతిష్టాత్మకంగా చేపడుతోందదని కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని 41వ వార్డు సచివాలయం పరిధిలో జరుగుతున్న పీ-4 సర్వేని ఆయన శనివారం క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.
మండలపరిధిలోని కల్లూరులో కొండకింద వెలసిన సింగరప్ప స్వామి దేవాలయం వద్ద శనివారం జరిగిన రాతిదూలం లాగుడు పోటీల్లో నాగర్ కర్నూల్ వృషభాలు ప్రథమ స్థానంలో నిలిచాయి. ప్రతి యేటా మాదిరిగానే మాఘమాసం నాలుగో శనివారం ఆరుపళ్ల వృషభాలకు పోటీలు నిర్వహించారు. జిల్లాతో పాటు కర్నూల్, నాగర్ కర్నూల్, నంద్యాల జిల్లాల నుంచి సుమారు 12 జతల వృషభాలు పాల్గొన్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన లోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. మండలంలోని అయ్య వారిపల్లిలో రూ. 40 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శనివారం భూమి పూజ చేశారు.
మొదటి రోడ్డు కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శని వారం నీలకంఠుడు కూరగా యలతో అలంకరించిన హంస వాహనంపై సరస్వతీదేవిగా దర్శినమిచ్చాడు.
దేశ వ్యాప్తంగా అన్ని జాతీయ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి శాశ్వత ఉద్యోగా ల నియామకాలు చేపట్టాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూని యన్స నాయకులు డిమాండ్ చేశారు. మార్చి 24, 25వ తేదీల్లో చేపట్టే దేశవ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం సాయంత్రం స్థానిక సాయి నగర్ లోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఎదుట ధర్నా నిర్వహించారు.
ఏపీపీఎస్సీ ద్వారా ఆదివారం జిల్లాలో జరగనున్న గ్రూప్- 2 పరీక్షలకు ఏర్పాట్లను జా యింట్ కలెక్టరు శివనారాయణశర్మ పరిశీలించారు. ఆయన శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎస్‌బీఎన, ఎస్వీ కళాశాలలో ఏర్పాట్లను పరిశీ లించారు. ఈసందర్బంగా జేసీ మాట్లాడుతూ గ్రూప్-2 పరీక్షలకు సంబం ధించిన ఏర్పాట్లు పూర్తికావాలన్నారు.
జిల్లాలో ఈ పంట నమోదు పక్కగా నిర్వహించాలని కలెక్టర్ వినోద్‌కుమార్ సూచించారు. ఆయన శుక్రవారం మండలంలోని కందుకూరు, సోములదొడ్డి గ్రామా ల్లో ఈ - క్రాప్ బుకింగ్ సూపర్ చెక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముం దుగా కందుకూరులో వై మురళీకృష్ణ సాగు చేసిన మొక్క జొన్న పంట ఈ- క్రాప్ బుకింగ్‌లో కలెక్టర్ సూపర్ చెక్ నిర్వహించారు.
పద్మశ్రీ డాక్టర్ ఆశావాది ప్రకాశరావు అనంత సాహితీ ప్రకాశం అని జనప్రియ కవి ఏలూరి యంగన్న పేర్కొన్నారు. ఆశావాది ప్రకాశరావు తృతీయ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం మొదటిరోడ్డులోని పొట్టి శ్రీరాములు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవాసంస్థ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల లు వేసి నివాళులర్పించారు.