Home » Adilabad
జిల్లాలో పెద్దపులి మరోసారి దాడి చేసింది. సిర్పూర్(టి) మండలం దుబ్బగూడ శివారులో ఓ రైతుపై పులి దాడికి తెగబడింది. పనుల నిమిత్తం పొలానికి వెళ్లిన రైతు సురేశ్‌పై దాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరిచింది.
జిల్లాలో మహిళపై పులి దాడి చేసి చంపడంతో తెలంగాణ అటవీ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. నిన్న(శుక్రవారం) దాడి జరిగిన ప్రాంతానికి దగ్గరలోనే పులి సంచరిస్తున్నట్లు అధికారులు నిర్ధరించారు.
కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని మలుపు తిప్పిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. నస్పూర్‌లోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో స్వరాష్ట్ర కలను నిర్థేశించిన రోజు దీక్షా -దీవస్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా ఇన్చార్జీ తుల ఉమా, మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్యలు పాల్గొన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్మాణ పనులను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్య లు తీసుకుంటుందన్నారు.
మం చిర్యాల గోదావరి తీరంలో శ్మశాన వాటిక నిర్మాణం పేరుతో వసూలు చేసిన విరాళాలను తిరిగి ఇవ్వా లని మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావును ఉద్దేశించి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు వ్యాఖ్యానిం చారు. గోదావరి తీరంలో జరుగుతున్న శ్మశాన వాటిక నిర్మాణ పనులను ఆయన శుక్రవారం పరి శీలించారు. పనులను వేగవంతం చేయాలని ఎమ్మె ల్యే అఽధికారులను ఆదేశించారు.
బీసీ కుల గణన కోసం దేశ వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడుతామని బీసీ సంక్షేమ సం ఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు నిర్వహించిన బీసీ కుల గణన చైతన్య యాత్ర ముగింపు సభను శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఫంక్షన్‌హాలులో నిర్వహించారు.
కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తీసుకవచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని అదనపు కలెక్టర్ మోతీలాల్ సూచించారు. చింతపల్లి, నెల్కివెంకటాపూర్ గ్రామాల్లోని కేంద్రాలను శుక్రవారం తనిఖీ చేశారు. ఆయన మాట్లా డుతూ కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సి బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రాంతంలో పెద్ద పులి సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. పులి దర్జాగా రోడ్డు దాటుతూ స్థానికుల కంట పడింది. దీంతో వాహనదారులు పులిని సెల్ ఫోన్లతో ఫోటోలు తీసారు. ఈ క్రమంలో అటవీ అధికారులు దిమ్మదుర్తి సుర్జాపూర్, మాస్కాపూర్, ఎక్బాల్ పూర్ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.
ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా రైతన్నకు తేమ నిబంధనలు శాపంగా మారాయి. జిల్లాలో సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, డీసీఎంఎస్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉండడంతో కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు.
అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుం టామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ల నుంచి ఆన్లైన్ ద్వారా అధికారికంగా ఇసుక రవాణా చేయాలన్నారు. మండ లంలోని కర్జీ ఇసుక రీచ్‌ను గురువారం కలెక్టర్ సంద ర్శించారు.