Ram Navami ShobaYatra: శ్రీరామనవమి శోభాయాత్ర నిర్వాహకులకు సీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు..
ABN , Publish Date - Apr 03 , 2025 | 01:33 PM
CP CV Anand : శ్రీరామనవమిని పురస్కరించుకొని ప్రతి ఏడాది హైదరాబాద్‌లో అంగరంగా వైభవంగా శోభయాత్ర సాగుతోంది. ఈ ఏడాది కూడా శ్రీరామ శోభాయాత్ర కో ఆర్డినేషన్ భారీ ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ వీరితో గురువారం నాడు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు.

హైదరాబాద్: శ్రీరామనవమి సందర్భంగా 6వ తేదీన నిర్వహించే శోభాయాత్రను శాంతియుతంగా, సంతోషంగా జరుపుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ (CP CV Anand) తెలిపారు. ఇవాళ(గురువారం) శ్రీరామ శోభాయాత్ర కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కో ఆర్డినేషన్ కమిటీకి సీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు జారీ చేశారు. తారాం భాగ్ నుంచి శ్రీరామనవమి శోభాయాత్ర ప్రారంభం అవుతుందని అన్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శోభాయాత్ర ప్రారంభం అయ్యేలా నిర్వహకులు చూడాలని సూచించారు.
విగ్రహాలు చిన్నగా ఉండాలి..
శోభాయాత్ర దారులు చిన్నగా ఉంటాయని.. భారీ టస్కర్ వాహనాలు వెళ్లే అవకాశం ఉండదని సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. అందుకే టస్కర్ వాహనంతో ముందు ట్రయల్స్ నిర్వహించాలని సూచించారు. విగ్రహాల ఎత్తు కూడా చిన్నగా ఉండేలా చూసుకోవాలని సలహా ఇచ్చారు. డ్రోన్స్ ఎగుర వేయాలి అంటే ముందుగా తమకు సమాచారం ఇవ్వాలని అన్నారు. డీజే సౌండ్‌తో అనర్థాలు ఎక్కువగా జరుగుతున్నాయని.. శోభాయాత్రలో డీజే సౌండ్స్ తక్కువగా ఉండేలా చూడాలని అన్నారు. శోభాయాత్రలో పెద్దపెద్ద డీజే శబ్దాలు లేకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ సీవీ ఆనంద్ సూచించారు.
శోభాయాత్రలో పాటలు అలా ఉండొద్దు..
శోభాయాత్రలో పాటలు వేరే వర్గాలను కించ పరిచేలా ఉండకూడదని సీపీ సీవీ ఆనంద్ చెప్పారు. శోభాయాత్రలో ఇబ్బంది లేకుండా రోడ్డుకు ఇరువైపులా వేదికలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. జాయింట్ కంట్రోల్ రూమ్ ఐసీసీసీలో ఏర్పాటు చేసి శోభాయాత్ర తీరును పర్యవేక్షిస్తామని చెప్పారు. 24 గంటలు కరెంట్, బ్యాక్ అప్ కోసం జనరేటర్‌లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆర్టీసీ నుంచి డ్రైవర్లు, కండక్టర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రసాదాల వితరణ కేంద్రాలను శోభాయాత్రకు అడ్డు లేకుండా ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. శోభాయాత్రకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతం చేయడానికి అన్ని ప్రభుత్వ విభాగాలు చర్యలు తీసుకోవాలని సీపీ సీవీ ఆనంద్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Telangana Congress: మంత్రివర్గ విస్తరణలో మరో ట్విస్ట్.. సోనియాతో ఆ నేతల భేటీ
KTR: రేవంత్ ప్రభుత్వానిది రియల్ ఎస్టేట్ ఆలోచన
Gachibowli: కంచ గచ్చిబౌలి విధ్వంసంతో జీవ వైవిధ్యానికి దెబ్బ
BJP: ఉచిత బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే..
CM Revanth Reddy: సర్వాయి పాపన్నకు సీఎం రేవంత్ నివాళి
Read Latest Telangana News and Telugu News