Home » GHMC
గ్రేటర్ హైదరాబాద్ మున్సినల్ కార్పొరేషన్ లో కంటోన్మెంట్ బోర్డు విలీనంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ విలీన ప్రక్రియపై చర్చలు కినసాగుతూనే ఉన్నాయి. జీహెచ్ఎంసీలో విలీనం జరిగితే ఈ ఏరియాలో మరిన్ని కార్యక్రమాలు జరిగే అవకాశముందని ఆశిస్తున్న ఇక్కడి ప్రజలకు తీరని నిరాశే ఎదురవుతోంది.
జీహెచ్ఎంసీలో వైఫై సేవలు నిలిచిపోయాయి. మొబైల్స్‌లో వీడియోలు, రీల్స్ చూస్తూ విధి నిర్వహణ పట్ల ఉద్యోగులు నిర్లక్ష్యం చూపుతున్నారని గుర్తించిన కమిషనర్ ఇలంబరిది దీనిపై సీరియస్ అయ్యారు. ఐటీ విభాగం అధికారులను పిలిచి వైఫై పాస్వర్డ్లు మార్చాలని ఆదేశించారు.
వాటర్‌బోర్డు సరఫరా చేసే తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించిన వ్యక్తికి అధికారులు జరిమానా విధించిన ఘటన జూబ్లీహిల్స్‌లో బుధవారం చోటుచేసుకుంది. వాటర్‌బోర్డు ఎండీ అశోక్ రెడ్డి పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ ప్రధాన రహదారిపై వెళ్తుండగా రోడ్డు నంబర్ 78లో నీరు లీకేజీ అవుతున్నట్లు గమనించాడు.
కాసులిస్తే నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ కనెక్షన్లు జారీ చేస్తూ కొంతమంది ఏఈలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. తక్కువ లోడ్లతో కొత్త కనెక్షన్లు జారీ చేస్తున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) నిబంధనల ప్రకారం 20 కిలోవాట్ల లోడ్‌కు మించి విద్యుత్ కనెక్షన్లు తీసుకోవాలంటే ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకోవాలి.
లంగర్‌హౌస్ హుడా చెరువు ప్రమాద ఘటనపై జీహెచ్ఎంసీ చర్యలకు శ్రీకారం చుట్టింది. అసిస్టెంట్ ఎంటమాలజిస్టు (ఏఈ) రమేష్, ఎంటమాలజీ ఫీల్డ్ అసిస్టెంట్ శివలను విధుల నుంచి తొలగిస్తూ కమిషనర్ ఇలంబరిది నిర్ణయం తీసుకున్నారు.
అనుమతులు లేని హోర్డింగ్‌లను తొలగించేందుకు ఆదివారం వరకు గడువు ఇస్తున్నట్టు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) తెలిపారు. నిర్ణీత గడువులోపు స్వయంగా తొలగించుకోవాలని, లేనిపక్షంలో తామే తొలగిస్తామని స్పష్టం చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారుల నిర్లక్ష్యంతో రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. చెరువును శుభ్రం చేసేందుకు అందులోకి దిగిన తండ్రీ కొడుకులు నీట మునిగి చనిపోయారు.
లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్)లో భాగంగా ప్లాట్ల క్రమబద్ధీకరణకు పురపాలక శాఖ సవరణ మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో దరఖాస్తుల పరిశీలనపై జీహెచ్ఎంసీ(GHMC) దృష్టి సారించింది.
రాజధాని హైదరాబాద్ మహానగరం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల్లో ఒకటి.. డ్రైనేజీ లీకేజీ. చిన్న చిన్న గల్లీల నుంచి ప్రధాన రహదారుల దాకా.. పేదలు ఉండే బస్తీల నుంచి సంపన్నులు ఉండే ప్రాంతాల దాకా..
హైదరాబాద్‌లో కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్య అధికంగా ఉన్న విషయం తెలిసిందే. ఆ మార్గం గుండా వెళ్లాలంటే ప్రయాణికులకు చుక్కలు కనపడతాయి. ఒక్కోసారి ముందుకు వెళ్లాంటే గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితులు ఉంటాయి.