Share News

AV Ranganath: తేల్చి చెప్పేశారు.. ఆదివారం ఆఖరు..

ABN , Publish Date - Mar 04 , 2025 | 08:56 AM

అనుమతులు లేని హోర్డింగ్‌లను తొలగించేందుకు ఆదివారం వరకు గడువు ఇస్తున్నట్టు హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌(Hydra Commissioner AV Ranganath) తెలిపారు. నిర్ణీత గడువులోపు స్వయంగా తొలగించుకోవాలని, లేనిపక్షంలో తామే తొలగిస్తామని స్పష్టం చేశారు.

AV Ranganath: తేల్చి చెప్పేశారు.. ఆదివారం ఆఖరు..

- ఆ లోపు అనుమతి లేని హోర్డింగ్‌లు తొలగించకుంటే మేమే తీసేస్తాం

- యాడ్‌ ఏజెన్సీల ప్రతినిధులతో రంగనాథ్‌

హైదరాబాద్‌ సిటీ: అనుమతులు లేని హోర్డింగ్‌లను తొలగించేందుకు ఆదివారం వరకు గడువు ఇస్తున్నట్టు హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌(Hydra Commissioner AV Ranganath) తెలిపారు. నిర్ణీత గడువులోపు స్వయంగా తొలగించుకోవాలని, లేనిపక్షంలో తామే తొలగిస్తామని స్పష్టం చేశారు. సోమవారం బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో యాడ్‌ ఏజెన్సీ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్బంగా రంగనాథ్‌ మాట్లాడుతూ రెండు నెలల్లో మునిసిపల్‌ కమిషనర్లు పలుమార్లు సమావేశమై చెప్పినా మీరు పట్టించుకోలేదని, అందుకు హైడ్రా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వివరించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: 2 రోజులు.. 248 కేసులు


city2.jpg

ప్రభుత్వం కొత్త విధానం రూపొందిస్తున్న దృష్ట్యా.. రెన్యూవల్స్‌(Renewals) నిలిచిపోయాయని, తాము రుసుము చెల్లించలేక పోయామని యాడ్‌ ఏజెన్సీ(Ad agency) ప్రతినిధులు రంగనాథ్‌ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఆయన.. రుసుము చెల్లించే హోర్డింగ్‌లను సర్కారు కొత్త పాలసీ ప్రకటించే వరకు తొలగించబోమన్నారు. హోర్డింగ్‌ల అనుమతుల ద్వారా ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల ఆదాయం రావాల్సి ఉండగా, రూ.20-30 కోట్లు మాత్రమే వస్తోందన్నారు.


ఈ వార్తను కూడా చదవండి: మెట్రో స్టేషన్ల నుంచి స్కైవాక్‌లు

ఈ వార్తను కూడా చదవండి: మరో ప్రముఖ ఆలయాన్ని దర్శించుకున్న బాలీవుడ్ నటి.. ఎవరంటే..

ఈ వార్తను కూడా చదవండి: పోచారంపై నిప్పులు చెరిగిన కవిత

ఈ వార్తను కూడా చదవండి: కృష్ణా జలాల్లో మాకు 70% వాటా ఇవ్వండి

Read Latest Telangana News and National News

Updated Date - Mar 04 , 2025 | 08:56 AM