Home » GHMC
హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్(HMDA Master Plan)ను పునఃసమీక్షించి రైతులకు అనుగుణంగా జోన్లను నిర్ణయించాలని మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లారెడ్డి(S Mallareddy) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Food Safety Officers Raids: హైదరాబాద్‌లోని పలు రెస్టారెంట్లలో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న రెస్టారెంట్లపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగం ఉక్కుపాదం మోపుతోంది.
వ్యాపార సంస్థలు జీహెచ్ఎంసీ(GHMC)కి ఇచ్చిన వ్యాపార పన్ను చెల్లింపు చెక్ బౌన్స్(Check bounce) అయిందా.. అయితే దుకాణానికి తాళమే.. చందానగర్ సర్కిల్ పరిధిలో 2025-26 వార్షిక సంవత్సరానికి చెల్లించాల్సిన వ్యాపార పన్నును వివిధ రకాలుగా చెల్లించవచ్చు.
జీహెచ్ఎంసీ(GHMC)లో కొందరు అధికారుల అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. రేటు కట్టి పౌర సేవలు.. బిల్లుల రూపకల్పన నుంచి చెల్లింపుల వరకు పర్సంటేజీలు.. అనుమతులు, నివాసయోగ్య పత్రాల జారీకి తీసుకునే అమ్యామ్యాలు చాలవన్నట్టు.. బల్దియా ఖజానాకు కన్నం వేస్తున్నారు.
ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చే సందర్శకుల కోసం ‘స్కైవాక్’ లాంటి ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(Shanthi kumari) అధికారులకు సూచించారు.
అసెంబ్లీ ఎన్నికలప్పుడు హైదరాబాద్ జిల్లా పరిధిలోని 14 నియోజకవర్గాల్లోని పోలింగ్ బూత్‌లలో వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇప్పటికీ బిల్లులు చెల్లించలేదని జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల సంఘం ఆరోపించింది.
GHMC: తెలంగాణలో జీహెచ్ఎంసీలో ప్రధాన పార్టీల మధ్య రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఈనెల 11వ తేదీ తర్వాత మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డిలపై అవిశ్వాసానికి బీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. కార్పొరేట్లర్లు కూడా అవిశ్వాసానికి పట్టుబడుతున్నారు.
GHMC: ఆదివారం వస్తే లొట్టలేసుకుని తినే కోడి, మేక మాంసంలో కల్తీ జరుగుతోంది. చచ్చిన కోళ్లు, కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తూ కొంతమంది వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న మాంసం దుకాణాలను జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు.
మీరాలం చెరువుపై నిర్మించనున్న వంతెన హైదరాబాద్ నగరానికే తలమానికంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి పురపాలకశాఖ అధికారులకు సూచించారు.
తనకు సమాచారం ఇవ్వకుండా జీహెచ్ఎంసీ అధికారులు అన్యాయంగా తన పాల కేంద్రాన్ని కూల్చి వేశారని ఓ మహిళ పెట్రోల్ బాటిల్ పట్టుకుని హల్ చల్ చేసింది. జీహెచ్ఎంసీ వాహనం ముందు కూర్చోని నిరసన తెలిపింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది.