Home » HYDRA
తక్కువ ఖర్చుతో కర్ణాటక ప్రభుత్వం బెంగుళూరులో 35 చెరువులను అభివృద్ధి చేసింది. చెరువుల పరిరక్షణకు, తీసుకుంటున్న చర్యలపై.. హైడ్రా బృందం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తోంది. కమిషనర్ ఏవీ రంగనాథ్తో పాటు పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పర్యటిస్తున్నారు. పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత సిటీలో మొదటి దశలో నాలుగు చెరువుల ప్రక్షాళనపై ఫోకస్ పెట్టనున్నారు.
మూసీ ప్రక్షాళనకు, హైడ్రాకు తాము వ్యతిరేకం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.
‘హైడ్రా ఎక్కడ తన ఇల్లు కూల్చివేస్తుందో అని మూడు రోజులపాటు ఆందోళన చెందిన బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుంది. ఇది ముమ్మాటికీ హైడ్రా అనే అరాచక సంస్థ ద్వారా సీఎం రేవంత్రెడ్డి చేయించిన హత్య.
ప్రభుత్వం అవగాహనా రాహిత్యంతో అర్ధం పర్ధం లేని నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. పేద మహిళ ఆత్మహత్యకు ప్రభుత్వం కారణమైందన్నారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం పేదలను ఇబ్బంది పెడుతోందని కేటీఆర్..
ప్రభుత్వ అనుమతులున్న భవనాలను హైడ్రా(Hydra) కూల్చదని.. సర్వే నంబర్లు మార్చి, తప్పుడు సమాచారంతో అనుమతులు పొంది, భూములు, చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై మాత్రమే చర్యలు ఉంటాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) స్పష్టం చేశారు. నగరవాసులకు మెరుగైన జీవనాన్ని కల్పించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా వందరోజులు పూర్తి చేసుకున్నదని కమిషనర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Telangana: రాష్ట్రంలో హైడ్రా ఏర్పాటై నేటికి వందరోజులు పూర్తి అయ్యింది. ఈ వందరోజుల్లో ఎన్నో అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. అలాగే హైడ్రాకు ప్రభుత్వం కూడా ఫుల్ పవర్స్ ఇచ్చేయడంతో ఇక తిరుగేలేకుండా పోయింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న అనేక అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చి వేసింది.
‘‘భయపడకండి.. మీ ఇళ్లను ఎవ్వరూ కూల్చరు.. మీకు బీజేపీ అండగా ఉంటుందని గోల్నాక డివిజన్లోని మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు ఆ పార్టీ మెదక్ ఎంపీ రఘునందన్రావు(Medak MP Raghunandan Rao) భరోసా ఇచ్చారు.
కూకట్పల్లి(Kukatpally)లో హైడ్రా పేరు వింటేనే ఆక్రమణదారులు, ఫుట్పాత్ వ్యాపారుల గుండెలో వణుకు పుడుతోంది. హైడ్రా అధికారులను అడ్డుకునేందుకు ఏం చేయాలని, తమ వ్యాపారాలు పోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, స్వచ్ఛందంగానే తొలగించుకోవాల్సి వస్తుందా.. లేదంటే స్థానిక నాయకులతో చర్చించాలా అంటూ చిరు వ్యాపారులు చర్చించుకుంటున్నారు.
వర్షం పడితే నగరంలోని పలు ప్రాంతాలు నీట మునగడం, రహదారులు జలమయం కావడం వంటి సమస్యలకు ప్రధాన కారణం సరైన వరద ప్రవాహ వ్యవస్థ లేకపోవడంతో పాటు నాలాలు, స్ట్రామ్ వాటర్ డ్రైన్లలో వ్యర్థాలు తొలగించకపోవడమేనని అధికారులు గుర్తించారు.
భవన నిర్మాణాలకు సంబంధించిన సంస్థల నుంచి అనుమతి(చెల్లుబాటయ్యే అనుమతి) తీసుకొని చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.