Home » Palnadu
పల్నాడు జిల్లా మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) అరాచకానికి అడ్డూ ఆదుపు ఉండదు! అయితే.. ఈ ఎన్నికల్లో ఓ మహిళ వీరనారిలా ముందుకొచ్చి ఆయనకు ఎదురు నిలిచారు. ఏజెంట్లుగా ఉండేందుకు పురుషులు తటపటాయిస్తున్న చోట ఏజెంట్‌గా కూర్చున్నారు. ఇది సహించలేక వైసీపీ (YSRCP) మూకలు ఆమెపై వేటకొడవళ్లతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు.
పల్నాడు జిల్లా: చిలకలూరిపేట వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. చీరాల నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన ట్రావెల్స్ బస్సు.. టిప్పర్ లారీని ఢీ కొంది
Andhrapradesh: పల్నాడులో హింసాత్మక ఘటనలపై ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పల్నాడులో చాలా చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయన్నారు. గతంలో ఎన్నడూ జరగనంత అధ్వాన్నంగా పల్నాడులో ఎన్నికలు జరిగాయని తెలిపారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని విమర్శించారు.
నరసరావుపేటలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. పోలింగ్ సందర్భంగా వైసీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులపై వైసీపీ నేతలు దాడి చేశారు. మల్లమ్మ సెంటర్లో టీడీపీకి చెందిన నేత వాహనాన్ని నడిరోడ్డుపై వైసీపీ నేతలు తగలబెట్టారు.
పోలింగ్ రోజు కూడా వైసీపీ అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. పల్నాడు జిల్లా టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్‌బాబును(Chadalavada Arvind Babu) వైసీపీ మూకలు టార్గెట్ చేశారు.
Andhrapradesh: పల్నాడు జిల్లాలో జరిగిన ఘటనలపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. పోలింగ్ ప్రారంభానికి ముందే పల్నాడులో గొడవలు జరగడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పల్నాడు గొడవపై ఆరా తీసిన ఈసీ.. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే మరిన్ని అదనపు బలగాలను తరలించేలా చూడాలని ఆదేశించింది. పీలేరులో ముగ్గురు ఏజెంట్లను కిడ్నాప్ చేసి పోలింగ్ స్టేషన్లకు చేరుకోలేని ప్రాంతంలో వదిలారని ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది.
పోలింగ్‌కు మరికొన్ని గంటల సమయమే ఉంది. కానీ అధికారి వైఎస్సార్సీపీ (YSRCP) మాత్రం కుయుక్తులకు పాల్పడటంలో ఏమాత్రం తగ్గడం లేదు. మరోసారి అధికారంలోకి రావడానికి వైసీపీలు కుట్రలకు పాల్పడుతోంది. దీనిలో భాగంగానే పల్నాడు జిల్లాలో ఉద్రిక్తతలకు ప్లాన్ చేసినట్లు సమాచారం. పల్నాడు జిల్లాలోని రెంటచింతలలో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మరోసారి విమర్శలు గుప్పించారు. వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలపై మాజీ మంత్రి మండిపడ్డారు. గతంలో ఇచ్చిన సున్నా వడ్డీ రుణాలు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ.. పావలా వడ్డీని కూడా పట్టించుకోలేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. రూ.3 వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధి ఏమైందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విరుచుకుపడ్డారు. మంత్రి అంబటి రాంబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఎన్నికల వేళ.. అధికార వైసీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఆ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. అధికార వైసీపీ వల్ల బాధిత కుటుంబాలుగా మారిన టీడీపీ సానుభూతిపరుల కుటుంబాలకు రక్షణ కల్పించాలని రెసిడెంట్లు.. కేంద్ర ఎన్నికల ఎన్నికల సంఘం, డీజీపీ, పల్నాడు ఎస్పీలను ఏపీ హైకోర్ట్ ఆదేశించింది.