Home » TG News
హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు సంబంధించి ఎన్టీటీ డేటా, నెయిసా సంయుక్తంగా రూ.10,500 కోట్లు, విద్యుత్తు సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తోషిబా కార్పొరేషన్ అనుబంధ సంస్థ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా (టీటీడీఐ) రూ.562 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి.
BJP Strategy: హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కమలం పార్టీ హై కమాండ్ కార్యచరణ రూపొందించింది. ఈ మేరకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఇవాళ జరిగే సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
నిత్యం వేలాది మందిని తమ గమ్యస్థానాలకు చేర్చుతున్న కాచిగూడ రైల్వే స్టేషన్ను నిర్మించి నేటికి 109 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ రైల్వే స్టేషన్ను 1916లో ప్రారంభించారు. కాచిగూడ రైల్వే స్టేషన్ వారసత్వ భవనాలు చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచాయి.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో.. కెమెరాతో పైప్లైన్ లీకేజీ గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైంది. నీరు కలుషితం కాకుండా చూడటం, అంటు రోగాలు వ్యాప్తి చెందకుండా చూసే క్రమంలో భాగంగా ఈ పద్దతిని ఏర్పాటు చేశారు.
మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు.. అన్న గేయం ఇక్కడ సరిగ్గా వర్తిస్తుందని చెప్పవచ్చు. ఇంకా కళ్లు కూడా తెరవని కుక్క పిల్లలను కొట్టిచంపాడో నీచుడు. ఈ సంఘటన అల్వాల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
గత మూడేళ్లుగా పలు సమస్యలతో బాధపడుతున్న ఓ మహిళ (52) వైద్యులు అరుదైన సర్జరీ నిర్వహించి పునర్జన్మ కల్పించారు. నగరంలోని విజయనగర్ కాలనీకి చెందిన ఓ మహిళ గత మూడేళ్లుగా పలు సమస్యలతో బాధపడుతోంది. అయితే.. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెకు అరుదైన సర్జరీ నిర్వహించి ప్రాణాపాయం లేకుండా చేశఆరు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం ఇక్రిశాట్ క్యాంపస్లో సంచరిస్తున్న చిరుతను జూపార్కు అధికారులు బంధించి దానిని అక్కడకు తరలించారు. పటాన్చెరువు మండలం ఇక్రిశాట్ క్యాంపస్లో వేలిది ఎకరాల్లో వివిధ పంటలకు సంబంధించిన పరిశోదనలు జరుగుతుంటాయి. అయితే.. ఎక్కడినుంచి వచ్చిందో.. ఎలా వచ్చిందో తెలియదు కాని చిరుతపులి సంచారాన్ని సిబ్బందితోపాటు స్థానికులు గుర్తించారు. అనంతరవ విషయాన్ని అదికారులకు తెలియజేయగా ఎట్టకేలకు దానిని గుర్తించి బంధించారు.
మీరు బయట జ్యాస్ తాగుతున్నారా.. అయితే ముందుగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. నగరంలో కొన్ని జ్యూస్ స్టాళ్లలో అపరిశుభ్రత తాండవిస్తోంది. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటమేగాక కుళ్లిన, మెత్తబడిన పండ్లతో జ్యూస్ చేసి ఇస్తున్నారు. ఇది తాగిన వారు అనారోగ్యానికి గురవుతున్నారు.
కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య తీవ్రంగా స్పందించారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే నాలుక కోస్తామని హెచ్చరించారు
పోలవరం ద్వారా కృష్ణా డెల్టాకు తరలించే నీటిలో 45 టీఎంసీలను తెలంగాణకు కేటాయించాలని ట్రైబ్యునల్ ముందు వాదించింది. బచావత్ ట్రైబ్యునల్ పేరుతో ఎగువ రాష్ట్రాలకు లబ్ధి కలిగిందని పేర్కొంటూ తెలంగాణ పక్షం స్పష్టమైన దృక్కోణం వెల్లడించింది.