Home » Tiger 3
నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రాంతంలో పెద్ద పులి సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. పులి దర్జాగా రోడ్డు దాటుతూ స్థానికుల కంట పడింది. దీంతో వాహనదారులు పులిని సెల్ ఫోన్లతో ఫోటోలు తీసారు. ఈ క్రమంలో అటవీ అధికారులు దిమ్మదుర్తి సుర్జాపూర్, మాస్కాపూర్, ఎక్బాల్ పూర్ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.
దివాన్‌చెరువు, సెప్టెంబరు 14 : చిరుతపులిని త్వరలోనే ఖచ్చితంగా పట్టుకుంటామని జిల్లా అటవీ అధికారి ఎస్.భరణి తెలిపారు. శనివారం స్థానిక మీడియాతో ఆమె మాట్లాడారు. ఇంతవరకూ నివాస ప్రాంతాలలో చిరుతపులి సంచరించినట్లు నిర్ధారణ లేదన్నారు. చిరుతను సురక్షితంగా పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని అందులో భాగంగా 50 మంది సభ్యులు తొమ్మిది బృందాలుగా ఏర్పడి చిరుతపులి జాడ కోసం గాలిస్తున్నా