గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా.. పూనియాపై ఆసీస్ హైకమిషనర్ ప్రశంసలు
ABN , First Publish Date - 2021-08-03T06:11:11+05:30 IST
టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు అద్భుతం చేసింది. ఒలింపిక్స్ సెమీస్ చేరి చరిత్ర సృష్టించింది.

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు అద్భుతం చేసింది. ఒలింపిక్స్ సెమీస్ చేరి చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా మహిళల హాకీ జట్టును భారత్‌లో ఆస్ట్రేలియా హైకమిషనర్ బ్యారీ ఓ ఫారెల్ ప్రశంసించారు. ముఖ్యంగా ఈ విజయంలో భారత మహిళల హాకీ జట్టు గోల్ కీపర్ సవితా పూనియా ఈ విజయంలో కీలక పాత్ర పోషించిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విజయం సాధించిన భారత జట్టును అభినందించిన ఆయన.. పూనియాను ‘గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా’ అంటూ మెచ్చుకున్నారు. ఆమెను ఓడించలేకపోయామని చెప్పారు. ‘‘ఇది చాలా కష్టమైన మ్యాచ్. అయితే మీ డిఫెన్స్ చివరి వరకూ తొణకలేదు’’ అంటూ భారత జట్టును ప్రశంసించారు. కాగా, భారత మహిళల జట్టు సెమీస్ చేరడానికి ఒకరోజు ముందే భారత పురుషుల హాకీ జట్టు కూడా ఒలింపిక్స్‌లో సెమీస్ చేరింది. ఈ క్రమంలో ఇరు జట్లూ అత్యద్భుతంగా రాణిస్తున్నాయి. సెమీస్‌లో ఈ రెండు జట్లూ గెలిస్తే భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు పడినట్లే.