బీజేపీ-కాంగ్రెస్ మధ్య తేడా అదే: దిగ్విజయ్

ABN , First Publish Date - 2021-09-02T19:51:19+05:30 IST

ప్రభుత్వ సంస్థల్ని, ఆస్తుల్ని అమ్మడానికి ప్రభుత్వం నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌‌ను ప్రకటించింది. 1947-2014 వరకు కాంగ్రెస్ పార్టీ దేశంలో చేసిన అభివృద్ధిని మొత్తం అమ్మకానికి పెట్టారు

బీజేపీ-కాంగ్రెస్ మధ్య తేడా అదే: దిగ్విజయ్

భోపాల్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌‌పై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 70 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏమీ చేయలేదని ప్రధాని మోదీ చెబుతున్నారని, అలా అయితే తాజా స్కీమ్‌తో మోదీ అమ్మాలనుకుంటున్నవి ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. గురువారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీకి కాంగ్రెస్‌కు మధ్య ఉన్న తేడా అర్హతలేని కుమారుడు/అర్హత కలిగిన కుమారుడికి ఉన్న తేడా అని అన్నారు.


‘‘ప్రభుత్వ సంస్థల్ని, ఆస్తుల్ని అమ్మడానికి ప్రభుత్వం నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌‌ను ప్రకటించింది. 1947-2014 వరకు కాంగ్రెస్ పార్టీ దేశంలో చేసిన అభివృద్ధిని మొత్తం అమ్మకానికి పెట్టారు. భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్న తేడా ఇది. అర్హతలేని కుమారుడు/అర్హత కలిగిన కుమారుడికి ఎలాంటి తేడా ఉంటుందో బీజేపీకి కాంగ్రెస్‌కు మధ్య కూడా అలాంటి తేడానే ఉంది. ఇన్ని అమ్మకానికి పెట్టారు. మళ్లీ 70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని మోదీ అంటున్నారు. కాంగ్రెస్ ఏమీ చేయకపోతే ఇప్పుడు ఏం అమ్ముతున్నారు?’’ అని దిగ్విజయ్ సింగ్ అన్నారు.

Updated Date - 2021-09-02T19:51:19+05:30 IST