Kurnool: ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ యువతి ఆందోళన
ABN , First Publish Date - 2021-09-16T14:31:02+05:30 IST
ప్రేమ వివాహం చేసుకొని మరో పెళ్ళికి సిద్ధమయ్యాడంటూ ఓ యువతి పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగింది.

కర్నూలు: ప్రేమ వివాహం చేసుకొని మరో పెళ్ళికి సిద్ధమయ్యాడంటూ ఓ యువతి పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగింది. జిల్లాలోని బనగానపల్లె మండలం పాతపాడుకు చెందిన హరిని, మధు కుమార్ గౌడ్‌ల కులాలు వేరు కావడంతో పెద్దలు వారి ప్రేమ పెళ్ళికి ఒప్పుకోలేదు. దీంతో ఆ ప్రేమ జంట రహస్యంగా గుడిలో వివాహం చేసుకుంది. కాగా మధుకుమార్ గౌడ్ వేరే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.