52 సెంటర్లలో లాయర్ విశ్వనాథం విడుదల
ABN , First Publish Date - 2021-03-04T05:07:29+05:30 IST
లాయర్ విశ్వనాథం చిత్రాన్ని 52 సెంటర్ల లో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు వానపల్లి బాబూరావు, ముదునూరి శ్రీహరిరాజు తెలిపారు.

ఆకివీడు, మార్చి 3: లాయర్ విశ్వనాథం చిత్రాన్ని 52 సెంటర్ల లో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు వానపల్లి బాబూరావు, ముదునూరి శ్రీహరిరాజు తెలిపారు. బు ధవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. బాలికలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారం వంటి సామాజిక రుగ్మతలపై కనువిప్పు కలిగించేవిధంగా లాయర్ విశ్వనాథ్ చిత్రాన్ని తెరకెక్కించామన్నారు. చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి విజయవంతం చేయాలన్నారు. ఆకివీడుకు చెందిన మల్లిపూడి ఎన్‌వీ సుధాకర్ స్వయంకృషితో పైకొచ్చారన్నారు. సుధాకర్ సినిమా నిర్మాతగా వ్యవహరించడం గర్వకారణమన్నారు. స్థానిక వెంకట గంగారత్న థియేటర్‌లో శుక్రవారం సినిమా డుదల చేస్తున్నామన్నారు. హీరో ఆలీతోపాటు జుబేరియా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. విలేకరుల సమావేశంలో చిరంజీవి సత్యనారాయణ, దాసరి బాలకృష్ణ, మారుబోయిన లెనిన్‌బాబు, బండారు అబ్బు ఉన్నారు.