ఈ చావురాగాలు ఇంకెన్నాళ్లు ఆలపిస్తారు !?
ABN , First Publish Date - 2020-04-17T06:20:08+05:30 IST
‘కరోనా’ మహమ్మారిపై విజయం సాధించే తరుణంలో, విషం చుక్కలా మీదపడిన ‘తబ్లిగ్-ఏ-జమాత్’ దుశ్చర్యను దేశ ప్రజలంతా అసహ్యించుకుంటుంటే, మతం పేరుతో వాళ్లకు ‘రక్షణ కల్పించే’ రాకాసి దండు ‘కుహనా మేధావులు’గా లేఖలు రాస్తుంటే...
‘కరోనా’ మహమ్మారిపై విజయం సాధించే తరుణంలో, విషం చుక్కలా మీదపడిన ‘తబ్లిగ్-ఏ-జమాత్’ దుశ్చర్యను దేశ ప్రజలంతా అసహ్యించుకుంటుంటే, మతం పేరుతో వాళ్లకు ‘రక్షణ కల్పించే’ రాకాసి దండు ‘కుహనా మేధావులు’గా లేఖలు రాస్తుంటే, వీళ్లంతా ప్రకృతి విరుద్ధంగా జీవిస్తున్నారని ఆశ్చర్యమేస్తోంది. దేశ విభజన సమయంలో జిన్నా మనస్తత్వానికి అండగా నిల్చిన ఈ ‘ఎర్రకుండలే’ ఈ జాతికి అడుగడుగునా గండంగా మారిపోయాయి. రాజ్యాంగాన్ని గౌరవించకుండా టూరిస్టు వీసాలపై ఈ దేశంలోకి ప్రవేశించి మతప్రచారం చేసి మహమ్మారిని అంటగట్టిన ‘మర్కజ్’ను బోనులో నిలబెట్టడం మతోన్మాదమా!? సంస్థల తప్పులు ఎత్తిచూపితే మతం రంగు పులుముతారా!
పాటియాలాలో ఓ సిక్కు వ్యక్తి తమ వాహనం ఆపినందుకు కృపాణంతో పోలీస్ చేయి నరికేసాడు. మొత్తం సిక్కు సమాజం దాన్ని జస్టిఫై చేసి ‘మా సిక్కులపై దాడి’ అనలేదు కదా! గతంలో ఆశారాంబాపు, గుర్మిత్ రాంరహీం వంటి వాళ్లపై ప్రభుత్వాలు చర్య తీసుకుంటే అదంతా ‘హిందూ సమాజంపై దాడి’గా భావించారా? తెలుగునాట కొన్ని మీడియా సంస్థలు తెంపరితనంతో ప్రవర్తిస్తున్నాయి. ఈ హర్యాలీ గ్యాంగ్, తుక్డే తుక్డే గ్యాంగుల ప్రభావంతో మెజార్టీ ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. ఉగాది, శ్రీరామనవమి జరిపితే చట్టపరంగా చర్యలు తీసుకొంటామంటూ మైకులు పట్టుకొని మెజార్టీ ప్రజల కాలనీల్లో కొచ్చి బెదిరింపు ధోరణితో చెప్పినా తల వంచుకొని శిరసావహించే వాళ్లు మీ దృష్టిలో దోషులా!
ఈ ‘హిపోక్రసీ’ అంటురోగం ‘సూడో మేధావులకు’ సూదిమందులా ఎవడెక్కించాడో తెలియదుగానీ సత్యాన్ని చంపేసే సాహసానికి పూనుకొన్నారు. ‘ప్రభుత్వం మాట మనం వినవద్దు, మనకు మతమే ప్రాధాన్యం’ అని ఇపుడు దేశం మొత్తం కరోనాను రుద్దిన సంస్థలు మీకు ప్రీతిపాత్రమా? వేలల్లో లక్షల్లో భక్తజనం సందర్శించే ఆలయాలవైపు కన్నెత్తి చూడకుండా ఆ దేవుళ్లనే పేదల్లో, డాక్టర్లలో, పారిశుద్ధ్య కార్మికుల్లో, పోలీసుల్లో చూస్తూ సహకరిస్తూ సేవ చేస్తున్న మెజార్టీలది మతోన్మాదమా! సేవ చేస్తున్న డాక్టర్లపై దాడులు చేస్తూ, నర్సులకు నగ్నావతార దర్శనమిస్తూ, వాటర్ బాటిళ్లలో మూత్రం నింపి విసిరేస్తూ, ఎక్కడంటే అక్కడ ఉమ్మేస్తూ దుశ్చర్యలకు పాల్పడుతున్నవాళ్లు శాంతికాముకులా!
కళ్లున్న గుడ్డివాళ్లలా సత్యాన్ని, గణాంకాలను చూడకుండా ఉన్మాద సంస్థలకు ఉక్కు కవచంలా నిలబడే మీరు మేధావులు, రచయితలు, కవులు, సంపాదకులా! ఈ చావురాగాలు ఇంకెన్నాళ్లు ఆలపిస్తారు!? ‘దొంగలకు సద్దిమూట గట్టే’ సిద్ధాంతాలను ఇప్పటికైనా వదలిపెట్టి ఆత్మవంచన లేకుండా బ్రతకండి! పత్రికల్లో తిష్ఠ వేసుక్కూర్చుని లాలూచీపడుతూ, లాభపడుతూ వాళ్ల పంచనజేరి, మరోవైపు ‘ఎర్రగుడ్ల’ను పొదిగే దొంగకోళ్లకు జన్మనిస్తున్న మీ ద్రోహబుద్ధి ఈ దేశం ఎప్పుడో పసిగట్టింది. ఇక మీ ఇష్టం!
ముదిగొండ శివప్రసాద్, కసిరెడ్డి వెంకటరెడ్డి, త్రిపురనేని హనుమాన్ చౌదరి, ముదిగొండ వీరభద్రయ్య, ఖండవల్లి సత్యదేవప్రసాద్, హెబ్బార్ నాగేశ్వరరావు, పి.భాస్కర యోగి, మావుడూరి సూర్యనారాయణమూర్తి, రాకా సుధాకర్‌రావు, మందాడి సత్యనారాయణరెడ్డి, మామిడి గిరిధర్, పగుడాకుల బాలస్వామి, గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు, నడింపల్లి ఆయుష్, కప్పర ప్రసాద్, నారపరాజు నర్సింగరావు, వనకళ్ల వీరప్ప, కె.ఎల్.కిస్మత్కుమార్, పిరాట్ల నాగేశ్వరరావు, క్రాంతిదేవ్ మిత్ర, సత్యవాణి, హనుమంతరావు, మాసాడి బాబూరావు, డా.మురళీమనోహర్, సంబరాజు రవిప్రకాశ్‌రావు, మాదిరాజు హరినందన్‌రావు, తరుణ్ చక్రవర్తి, ఉమ్మెత్తల మహేశ్వర్, విజయభారతి, కుంచకూరి బుచ్చిలింగం, అవుసల భానుప్రకాష్, గాజుల రవీందర్, గుంటి గోపి, భీంపల్లి శ్రీకాంత్, ప్రదీప్‌రెడ్డి, సామల కిరణ్, చిలకమర్రి లక్షీనాథాచార్యులు, డా.బి.జయరాములు, చక్రవర్తుల వేణుగోపాల్‌రావు, డా.లక్ష్మీ లావణ్య, సీతామహాలక్ష్మి, మాధవీలత, కృష్ణాగౌడ్, ఎడ్ల సతీష్ కుమార్, గొట్టిముక్కల చంద్రమోహన్.