ఊహించని రీతిలో Pushpa సినిమా కలెక్షన్లు.. ప్రీమియర్స్‌తో కలిపి ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందంటే..

ABN , First Publish Date - 2021-12-18T22:04:26+05:30 IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందనా జంటగా, ప్రముఖ దర్శకుడు బి సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప ది రైజ్' మూవీ తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లు కొల్లగొట్టింది.

ఊహించని రీతిలో Pushpa సినిమా కలెక్షన్లు.. ప్రీమియర్స్‌తో కలిపి ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందంటే..

ఎన్నారై డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందనా జంటగా, ప్రముఖ దర్శకుడు బి సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప ది రైజ్' మూవీ తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లు కొల్లగొట్టింది. సుమారు రూ.71కోట్ల వరకు వచ్చాయని సమాచారం. ఇక ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా భారీగానే విడుదలైన విషయం తెలిసిందే. అమెరికాలో హాంసిని ఎంటర్టైన్మెంట్స్, క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా సుమారు 389 స్క్రీన్స్‌లో ఈ సినిమాను రిలీజ్ చేశాయి. దీంతో ప్రీమియర్స్ ద్వారానే యూఎస్ఏ‌లో ఏకంగా 530వేల డాలర్లు (సుమారు రూ.4కోట్లు) రాబట్టింది. అటు తొలిరోజు 320వేల డాలర్లు(రూ.2.43కోట్లు) కలెక్ట్ చేసింది. దీంతో ప్రీమియర్స్, తొలి రోజు కలెక్షన్లు కలుపుకుని మొత్తం 850వేల డాలర్లు(రూ.6.46కోట్లు) కొల్లగొట్టింది. ఈ మేరకు ఇరు సంస్థలు ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశాయి. 


ఇదిలా ఉంటే.. ‘పుష్ప’ ఓవర్సీస్ రైట్స్‌ను చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ రూ.14 కోట్లకు అమ్మినట్లు సమాచారం. వీటిలో కేవలం అమెరికా ద్వారానే రూ.10కోట్ల మేర వచ్చాయట. అంటే అక్కడ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మిగతా రన్‌టైమ్‌లో మరో మూడున్నర కోట్లు సాధిస్తే సరిపోతుంది. ఇక పుష్పకు పాజిటివ్ టాక్ రావడంతో ఇది సాధించడం పెద్ద సమస్య కాదని సినీ విశ్లేషకుల అభిప్రాయం. పుష్పరాజ్ పాత్రలో బన్నీ ఇరగదీస్తే, శ్రీవల్లిగా రష్మిక కూడా బాగా నటించింది. రాక్‌స్టార్ దేవీ శ్రీప్రసాద్ సంగీతం ఈ మూవీకి బాగా హెల్ప్ అయింది. దేవీ ఇచ్చిన బీజీఎం పలు సన్నివేశాలను ఓ లెవల్‌కు తీసుకెళ్లిందని సినీ అభిమానులు చెబుతున్నమాట.   



Updated Date - 2021-12-18T22:04:26+05:30 IST