ఘనంగా పాలేటమ్మ జాతర సంబరాలు
ABN , First Publish Date - 2020-03-13T10:40:54+05:30 IST
కడప-చిత్తూరు జి ల్లాల ఆరాద్యదైవమైన కేశాపురం పాలేటమ్మ జాతర ఉత్సవ సంబరాలు అంబరాన్ని తాకా యి.

చిన్నమండెం, మార్చి 12 : కడప-చిత్తూరు జి ల్లాల ఆరాద్యదైవమైన కేశాపురం పాలేటమ్మ జాతర ఉత్సవ సంబరాలు అంబరాన్ని తాకా యి. బుధవారం ఉదయం నుంచి ప్రారంభమై న పాలేటమ్మ జారత గురువారం రాత్రి వర కు వైభవంగా సాగింది. వేలాది మందిభక్తులు పాలేటమ్మను దర్శించుకు న్నారు. బుధవా రం రాత్రి మొక్కులు ఉన్నవారు చాందినీ బం డ్లు కట్టి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు.
చాందినీ బండ్లముందు ఏర్పాటు చేసిన చెక్క భజనలు, ఇతర సాసం్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. బుధవారం అర్దరాత్రి నుంచి ప్రారంభమైన చాందినీ బండ్ల ఊరేగింపు గురువారం తెల్లవారే వరకు సా గింది. అనంతరం అమ్మవారి పొట్టేళ్ళను బలి ఇచ్చారు. గురువారం ఉదయం మాండవ్యానదిలో పాలేటమ్మ పారు వేట కార్యక్రమం నిర్వహించారు.
అమ్మవారి దర్శనానికి గురువారం సాయంత్రం భక్తులు వేల సంఖ్యలో తరలి వచ్చారు. భక్తులు కళ్ళు కోరలు, చీరలు అమ్మవారికి సమర్పించారు. గురువారం రాత్రి కల్లిపాటు వేయడంతో జారత ఉత్సవాలు ముగిశాయి. చిన్నమండెం మండలం నుంచే కాక, రాయచోటి, సంబేపల్లె, సుండుపల్లె, గుర్రంకొండ, వాయిల్పాడు, పెద్దమండెం, గాలివీడు మండలాలల నుంచి వేల సంఖ్యలో జనం తరలివచ్చారు. జాతర ప్రశాంతంగా నిర్వహించడానికి పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు ఏరాటు చేశారు.