Share News

Madhabi Buch: మాధవి బచ్‌పై ఎఫ్ఐఆర్... ముంబై కోర్టు ఆదేశం

ABN , Publish Date - Mar 02 , 2025 | 06:41 PM

సెబి అధికారులు విధి నిర్వహణలో విఫలమయ్యారని, మార్కెట్లో అవకతవకలకు, కార్పొరేట్ మోసానికి పాల్పడ్డారని ఫిర్యాదుదారు ఆరోపించారు. కార్పొరేట్ సంస్థతో కుమ్మక్కై ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినట్టు ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Madhabi Buch: మాధవి బచ్‌పై ఎఫ్ఐఆర్... ముంబై కోర్టు ఆదేశం

ముంబై: స్టాక్ మార్కెట్ అవకతవకలు, రెగ్యులేటరీ ఉల్లంఘనలకు సంబంధించిన ఆరోపణలపై 'సెబి' (SEBI) మాజీ చైర్‌పర్సన్ మాధబి పురీ బచ్ (Madhabi Puri Buch), మరో ఐదుగురు అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అవినీతి నిరోధక విభాగానికి (ACB) ముంబై ప్రత్యేక కోర్టు ఆదివారంనాడు ఆదేశించింది. దర్యాప్తును తాము పర్యవేక్షిస్తామని, 30 రోజుల్లోగా స్థాయీ నివేదికను సమర్పించాలని కోర్టు ఆదేశాల జారీ చేసింది.

DK Shivakumar: నా నమ్మకాలు నావి..ఎక్కడికైనా వెళ్తా: డీకే


మాధబి బచ్ పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలు, రెగ్యులేటరీ ఉల్లంఘనలు, అవినీతికి పాల్పడ్డారని దీనిపై విచారణకు ఆదేశించాలని థానేకు చెందిన జర్నలిస్టు సవన్ శ్రీవాత్సవ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రత్యేక న్యాయమూర్తి ఎస్ఈ బంగర్ తాజా ఉత్తర్వులు జారీ చేశారు. సెబి అధికారులు విధి నిర్వహణలో విఫలమయ్యారని, మార్కెట్లో అవకతవకలకు, కార్పొరేట్ మోసానికి పాల్పడ్డారని ఫిర్యాదుదారు ఆరోపించారు. కార్పొరేట్ సంస్థతో కుమ్మక్కై ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినట్టు ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్‌కు, సంబధింత రెగ్యులేటరీ సంస్థలను పలుమార్లు అప్రోచ్ అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన తెలిపారు. ఆన్ రికార్డ్ మెటీరియల్‌ను పరిశీలించిన కోర్టు.. ఐపీసీలోని నిబంధనలు, అవినీతి నిరోధక చట్టం, సెబీ చట్టం, ఇతర చట్టాల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది.


హిండెన్‌బర్గ్ ఆరోపణలు

కాగా, అదానీ గ్రూప్‌నకు చెందిన ఆఫ్‌షోర్ కంపెనీల్లో మాధబి పెట్టుబడులు పెట్టినట్టు గత ఏడాది ఆగస్టులో హిండెన్‌బర్క్ చేసిన పోస్ట్ కూడా సంచలనమైంది. ఇందులో ఆమె భర్త ధావలె బచ్‌కు కూడా పెట్టుబడులున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఈ ఆరోపణలను బచ్ దంపతులు తోసిపుచ్చారు. సెబీలో చేరడానికి ముందే తాము పెట్టుబడులు పెట్టామని తెలిపారు. హిండెన్‌బర్క్ ఇటీవల తమ బిజినెస్‌లను మూసేస్తున్నట్టు ప్రకటించింది.


ఇవి కూడా చదవండి

Mayawati: నేనున్నంత వరకూ నాకు వారసులు ఉండరు: మాయావతి బిగ్ స్టేట్‌మెంట్

PM Modi: 100 జిల్లాల్లో పీఎం ధన ధాన్య కృషి

Privilege Motion: జైశంకర్‌పై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 02 , 2025 | 06:44 PM