తిరు తిరు జవరాల...

ABN , First Publish Date - 2020-03-11T10:07:45+05:30 IST

సిద్ధేంద్ర యోగి నాట్యమహోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన మంగళవారం కూచిపూడి సిద్ధేంద్ర నాట్యకళావేదికపై ప్రదర్శించిన పలు కూచిపూడి నాట్యాంశాలు ఆద్యంతమూ భక్తిభావంలో ముంచెత్తాయి.

తిరు తిరు జవరాల...

ప్రేక్షకులను రంజింపజేస్తున్న కూచిపూడి నాట్యోత్సవాలు


కూచిపూడి, మార్చి 10 : సిద్ధేంద్ర యోగి నాట్యమహోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన మంగళవారం కూచిపూడి  సిద్ధేంద్ర నాట్యకళావేదికపై ప్రదర్శించిన పలు కూచిపూడి నాట్యాంశాలు ఆద్యంతమూ భక్తిభావంలో ముంచెత్తాయి. ఒరిస్సాకు చెందిన యామిని నరసాంబిక శిష్యబృందం, డాక్టర్‌ చింతా రవి బాలకృష్ణ, శిరీష నృత్య దర్శకత్వంలో ప్రదర్శించిన అంశాలు కనువిందు గావించాయి. ఆనంద నర్తన గణపతి అంశాన్ని సంజన, వైష్ణవి, తిరుతిరు జవరాల అంశాన్ని రాజి, సుదర్శిని, శివాని, షైని, మృణాళిని, యామిని, ఐషిత, గోపికలు ప్రదర్శించగా, మరకతమణిమయచేల అంశాన్ని హాసిని, ఆషా, ప్రియాంక, వనజ, వైష్ణవి, సంజన, రమ్య, నిరుపమ, మల్లేశ్వరిలు ప్రదర్శించగా, శంకర శ్రీగిరి అంశాన్ని అంబికలు ప్రదర్శించారు. వినరో భాగ్యము విష్ణుకథ అంశాన్ని మృణాళిని, వైష్ణవి, సంజన, మహాలక్ష్మి, ప్రియాంకలు ప్రదర్శించి మెప్పించారు. అనంతరం శ్రీవేద గాయత్రి నృత్యకళాక్షేత్రం విశాఖపట్నానికి చెందిన విద్యార్థులు శ్రీదేవి, డాక్టర్‌ యేలేశ్వరపు శ్రీనివాస్‌ల నృత్య దర్శకత్వంలో పలు అంశాలు ప్రదర్శించి కళాభిమానుల మనస్సు దోచారు. నమోస్తుతే, తంబూర మీటెదవా, దశవతారాలు, జగన్మోహనకృష్ణ, వందే వందే వాణి భవాని, జగదోద్దరణ, అష్టలక్ష్మి వైభవం అంశాలను పూజ, ధరణి, హారిక, రేవతి, ఇషా, భాషిత, జాహ్నవి తదితరులు ప్రదర్శించి రసజ్ఞులైన ప్రేక్షకులను రంజింపచేశారు. అఖిలభారత కూచిపూడి నాట్యకళామండలి కార్యదర్శి పసుమర్తి కేశవప్రసాద్‌ మెమొంటోలు అందించి కళాకారులను సత్కరించారు. 


Updated Date - 2020-03-11T10:07:45+05:30 IST