ప్లేట్ మిడతల బిర్యానీ రూ. 200లకే.. ఎక్కడో తెలుసా?

ABN , First Publish Date - 2020-05-31T22:55:35+05:30 IST

మహాతిండుబోతులుగా పేరొందిన మిడతలపై రాజస్థాన్ ప్రజలు ఇప్పుడు రివేంజ్ తీర్చుకుంటున్నారు. పంట పొలాలను మింగేసిన ఆ మిడతలతో ..

ప్లేట్ మిడతల బిర్యానీ రూ. 200లకే.. ఎక్కడో తెలుసా?

మహాతిండుబోతులుగా పేరొందిన మిడతలపై రాజస్థాన్ ప్రజలు ఇప్పుడు రివేంజ్ తీర్చుకుంటున్నారు. పంట పొలాలను మింగేసిన ఆ మిడతలతో స్థానిక రెస్టారెంట్లు బిర్యానీ, వేపుళ్లు, కూరలు వండటం మొదలు పెట్టాయి. మకాడ్ బిర్యానీ పేరుతో థార్, జైపూర్ రెస్టారెంట్లలో అమ్మకాలు మొదలుపెట్టారు. ఒక్క ప్లేటు బిర్యానీని రూ. 200కు విక్రయిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక రెస్టారెంట్ యజమాని మీడియాతో మాట్లాడుతూ ‘‘మిడతలు చాలా రుచిగా ఉంటాయి. అందులో బోలెడన్నీ ప్రొటీన్స్ ఉంటాయి. మిడతలను ఉడికించే ముందు బాగా శుభ్రం చేయాలి. దాని కాళ్లు, రెక్కలను తొలగించాలి.’’ అని తెలిపారు. 


అయితే మిడతల బిర్యానీని తినేందుకు తయారు చేశారా?. లేదా పబ్లిసిటీ కోసం తయారు చేశారా? అనేది తెలియదు. దీన్ని ప్రజలు తింటున్నారా? లేదా అనేది కూడా అనుమానమే. అయితే పాకిస్థానీలు మాత్రం వీటిని లొట్టలేసుకుని తినేస్తున్నారట. వాస్తవానికి రాజస్థాన్ రెస్టారెంట్లు ఆ దేశాన్ని చూసే ఈ బిర్యానీ తయారీ మొదలు పెట్టారట. 


ఇవి క్రమంగా అన్ని రాష్ట్రాలకు పాకి ఇక్కడి జనం కూడా చూస్తే పరిస్థితి ఏంటి?. అన్నది తాజా సమస్య. పాకిస్థాన్‌లోని చర్చ్‌రో ప్రాంతంలో మిడతలను బాగా వేయించి వాటిపై కరివేపాకులు చల్లి స్నాక్స్‌లా తింటున్నారు. మరోవైపు రుచికరమైన బిర్యానీలు సైతం తయారు చేస్తున్నారు. ఈ బిర్యానీని అక్కడ మాక్ బిర్యానీ అని పిలుస్తారు. ఒక ప్లేట్ మిడతల బిర్యానీ రూ. 300ల ధర పలుకుతోంది. ఈ విషయం తెలిస్తే మిడతలు మున్ముందు ఇటువైపు రావడానికి భయపడతాయేమో?. 

Updated Date - 2020-05-31T22:55:35+05:30 IST