మహా నాయకురాలు ఇందిరాగాంధీ
ABN , First Publish Date - 2020-11-20T05:40:18+05:30 IST
భారతదేశ ప్రతిష్ఠను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా పనిచేసిన మహా నాయకురాలు ఇందిరాగాంధీ అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

జగిత్యాల టౌన్, నవంబరు 19: భారతదేశ ప్రతిష్ఠను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా పనిచేసిన మహా నాయకురాలు ఇందిరాగాంధీ అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌లో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం వద్ద గురువారం మాజీ ప్రధాని ఇంధిరాగాంధీ 103 జయంతి వేడుకలను జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంధిరాగాంధీ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు అడ్లూరి మాట్లాడుతూ దేశ సమగ్రత, ఐక్యత కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటం చేసిన నాయకురాలు ఇందిరాగాంధీ అని కొనియాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా బ్యాంక్‌లను జాతీయీకరణ చేసేలా చర్యలు చేపట్టిన గొప్ప వ్యక్తి అని వివరించారు. దున్నేవాడికే భూమిపై హక్కు కల్పించి ప్రతి నిరుపేదను భూ యాజమానిగా మార్చిన ఘనత ఇందిరాగాంధీకే దక్కిందన్నారు. ఊరూరా గూడు లేని నిరుపేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చారని వివరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బండ శంకర్, మాజీ మున్సిఫల్ చైర్మన్ గిరి నాగభూషణం, నాయకులు దేవేందర్ రెడ్డి, గాజుల రాజేందర్, అల్లాల రమేష్ రావు, కల్లెపెల్లి దుర్గయ్య, బింగి రవి, పుప్పాల అశోక్, దయాల శంకర్, బాపురెడ్డి, రియాజ్, జీవన్, విజయ్ ,లింగంపేట మహేందర్, తదితరులు పాల్గొన్నారు.