సీఆర్డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ను పిలిపించిన సీఐడీ అధికారులు

ABN , First Publish Date - 2021-03-19T21:20:31+05:30 IST

రాజధాని అసైన్డ్‌ భూముల అంశంలో సీఐడీ దాఖలు చేసిన కేసులో అధికారుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. అప్పటి గుంటూరు

సీఆర్డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ను పిలిపించిన సీఐడీ అధికారులు

అమరావతి: రాజధాని అసైన్డ్‌ భూముల అంశంలో సీఐడీ దాఖలు చేసిన కేసులో అధికారుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. అప్పటి గుంటూరు జాయింట్‌ కలెక్టర్‌, సీఆర్డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ను సీఐడీ అధికారులు పిలిపించారు. తాడేపల్లిలో శ్రీధర్‌ను అధికారులు విచారిస్తున్నారు. అప్పట్లో గుంటూరు, తుళ్లూరు రెవెన్యూ అధికారుల పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నారు. రాజధాని అసైన్డ్‌ భూములపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి గత నెల 24వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు... శుక్రవారం (ఈనెల 12న) సీఐడీ కేసు నమోదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా సీఐడీ అధికారులు హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి 41(ఏ) సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చారు. సీఐడీ అధికారులు రెండు బృందాలుగా అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో నివాసంలోనే ఉన్న చంద్రబాబు నోటీసులు అందుకున్నారు. ‘‘ఈ కేసులో దర్యాప్తు నిమిత్తం మిమ్మల్ని ప్రశ్నించాల్సి ఉంది. మీకు(ఏ1) మాత్రమే తెలిసిన వివరాలు తెలుసుకోవాల్సి ఉంది. అందువల్ల... ఈనెల 23వ తేదీ ఉదయం 11 గంటలకు  విజయవాడ సత్యనారాయణపురంలో ఉన్న సీఐడీ రీజనల్‌ ఆఫీసుకు వ్యక్తిగతంగా హాజరు కావలెను’’ అని సీఐడీ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. 


Updated Date - 2021-03-19T21:20:31+05:30 IST