పన్ను నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2021-01-09T05:13:42+05:30 IST

ప్రభుత్వం తీసుకొచ్చిన ఆస్తి విలువ ఆధారంగా పన్ను పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఎమ్మొల్సీ కేఎస్‌ లక్ష్మణరావు డిమాండ్‌ చేశారు.

పన్ను నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
కమీషనర్‌ చల్లా అనురాధకు వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మేల్సీ కేయస్‌ లక్ష్మణరావు, తదితరులు

ఎమ్మెల్సీ కేయస్‌ లక్ష్మణరావు

గుంటూరు(తూర్పు), జనవరి8: ప్రభుత్వం తీసుకొచ్చిన ఆస్తి విలువ ఆధారంగా పన్ను పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఎమ్మొల్సీ కేఎస్‌ లక్ష్మణరావు డిమాండ్‌ చేశారు.  ఆస్తి పన్ను పెంపు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా అనురాధకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నీళ్ళు, చెత్త, డైనేజీ, కరెంటు వంటివాటికి కూడా ఆస్తి విలువ ఆధారంగా పన్ను వేయడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో భారవి, అజయ్‌కుమార్‌, సీతారమేష్‌, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-09T05:13:42+05:30 IST