సంస్కృతి పరిరక్షణకు నడుం బిగించాలి

ABN , First Publish Date - 2021-02-22T05:12:59+05:30 IST

సనాతన ధర్మంలో భాగమైన హిందూ సంస్కృతి పరిరక్షణకు ప్రతిఒక్కరూ నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందని తాళ్లాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శ్రీశివస్వామి తెలిపారు.

సంస్కృతి పరిరక్షణకు నడుం బిగించాలి
హోమం నిర్వహిస్తున్న శివస్వామి

గుంటూరు(సాంస్కృతికం), ఫిబ్రవరి 21: సనాతన ధర్మంలో భాగమైన హిందూ సంస్కృతి పరిరక్షణకు ప్రతిఒక్కరూ నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందని తాళ్లాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శ్రీశివస్వామి తెలిపారు. సంపత్‌నగర్‌ రామానామ క్షేత్ర ప్రాంగణంలో నవశక్తి క్షేత్రం, వాసవీ పరివార్‌ ఇంటర్నేషనల్‌ సంయుక్త ఆధ్వర్యంలో శివస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆదివారం అష్టదేవతల కల్యాణం, బ్రహ్మయజ్ఞం కార్యక్రమాలు జరిగాయి.    సీతారాముల మహాగణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, రుక్మిణీ గోపాలుడు, వేంకటేశ్వరస్వామి, సూర్య నారాయణస్వామిల కల్యాణం నిర్వహించారు. శివస్వామి అనుగ్రహ భాషణం చేస్తూ వేల సంవత్సరాల చరిత్ర కలిగిన హిందూ సంస్కృతిపై ముప్పేట దాడి జరుగుతున్నదన్నారు. దానిని ఎదుర్కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. కార్యక్రమంలో క్రేన్‌ గ్రూప్‌ సంస్థల అధినేత గ్రంధి కాంతారావు, ఆతుకూరి ఆంజనేయులు, గ్రంధి హనుమంతరావు, వాసవీ పరివార్‌ అధ్యక్షుడు వేముల హజరత్తయ్య గుడివాడ రవీంద్రకుమార్‌, అమర బాలవిశ్వేశ్వరరావు, సాయి కమలేష్‌, జయశ్రీ, శివకుమార్‌, భవనాసి శివకుమార్‌, గ్రంధి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-22T05:12:59+05:30 IST